మార్చి 4న ఏపీ కేబినెట్ భేటీ... అజెండా ఏంటంటే
ఏపీ క్యాబినెట్ భేటీ కాబోతుంది . మార్చి 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం కానుంది. అమరావతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలను, రాష్ట్రంలోని తాజా పరిస్థితులను చర్చించనున్నారు.

Recommended Video
3 Minutes 10 Headlines | AP EAMCET 2020 Notification | COVID-19 Update
ఏపీ క్యాబినెట్ భేటీలో ముఖ్యంగా మూడు అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది . ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలపై , త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు, వివిధ సంస్థలకు జరిపిన భూకేటాయింపులపై చర్చించి క్యాబినెట్ నిర్ణయం తీసుకోనుంది . ఇక అంతే కాదు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పై దాడి ఘటన, విశాఖ పర్యటనలో చోటు చేసుకున్న ఉద్రిక్తత పరిస్థితులపై కూడా క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications