మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం - జగన్ ఎన్నికల వరాలు, నేడే..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. ముఖ్యమంత్రి జగన్ అభ్యర్ధుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరింది. అటు పాలనా పరంగా..ఇటు పార్టీలోనూ సీఎం జగన్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల వేళ కొత్త వరాల ప్రకటన దిశగా జగన్ ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు సమాచారం. ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో వీటిని ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగులు, రైతులు, మహిళలకు సంబంధించిన నిర్ణయాలను ఫైనల్ చేసే ఛాన్స్ ఉంది.

కీలక భేటీ:ఈ రోజు జరిగే ఏపీ మంత్రివర్గ సమావేశం కీలకంగా మారుతోంది. ఎన్నికల వేళ జగన్ ప్రభుత్వం కొత్త నిర్ణయాల ప్రకటనకు సిద్దమైంది. అధికారంలోకి వచ్చిన సమయం నుంచి సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చిన జగన్..ఎన్నికల సమయంలో అదే సంక్షేమం - సామాజిక న్యాయం తిరిగి తనకు అధికారం అందిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఇదే సమయంలో మరిన్ని నిర్ణయాలకు సిద్దమయ్యారు. ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన తుది నిర్ణయం తీసుకొనే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో అమల్లో ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం పైన ఆర్టీసీ అధికారులు అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అమలుతో ఆర్ధిక భారంతో పాటుగా, నిర్వహణలో ఎదురవుతున్న కష్ట నష్టాల గురించి నివేదిక ఇచ్చారు.

AP Cabinet,eeting today to take crucial decisions ahead Assembly Elections

ఎన్నికల వరాలు:ఇక, ఇదే సమయంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం, కమిటీ నివేదిక సమయం తీసుకోనుంది. దీంతో ఉద్యోగులకు ఐఆర్ ప్రకటనకు సిద్దమైనట్లు తెలుస్తోంది. దీని పైన నేటి మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మెగా హౌసింగ్ స్కీంలో భాగంగా జగనన్న కాలనీల ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేయనున్నారు. అదే విధంగా రైతు భోసా, సున్నావడ్డీ, ఇన్ పుట్ సబ్సిడీ వంటి నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం. రైతులకు రుణమాఫీ దిశగా కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. దీని పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

జగన్ దిశా నిర్దేశం:ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 9వ తేదీ వరకు సమావేశాల నిర్వహణకు అవకాశం ఉంది. సమావేశాల నిర్వహణ పైన ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశం లో నిర్ణయం తీసుకోనున్నారు. ఇక, అభ్యర్దుల మార్పు, రాజ్యసభ ఎన్నికలు, ఎన్నికల ప్రచారం వంటి అంశాల పైన మంత్రులకు సీఎం జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు. మేనిఫెస్టో కమిటీ పైన నేడు నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల తరువాత సీఎం జగన్ సహా అందరూ ఎన్నికల ప్రచారంలో నిమగ్నం కానున్నారు. దీంతో..ఈ మంత్రివర్గ సమావేశంలో అధికారికంగా తీసుకొనే నిర్ణయాలు.. రాజకీయంగా సీఎం జగన్ చేసే దిశా నిర్దేశం పైన ఆసక్తి కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+