చంద్రబాబు ఆ అయిదుగురి తొలగింపు వెనుక.. వారు ముందే ప్రిపేర్ అయ్యారా?
ఏపీ కేబినెట్ విస్తరణలో అయిదుగురు చోటు కోల్పోయారు. బొజ్జల గోపాల కృష్ణ రెడ్డి, పీతల సుజాత, రావెల కిషోర్ బాబు, మృణాళిని, పల్లె రఘునాథ్ రెడ్డిలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్వాసన పలికారు.
అమరావతి: ఏపీ కేబినెట్ విస్తరణలో అయిదుగురు చోటు కోల్పోయారు. బొజ్జల గోపాల కృష్ణ రెడ్డి, పీతల సుజాత, రావెల కిషోర్ బాబు, మృణాళిని, పల్లె రఘునాథ్ రెడ్డిలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్వాసన పలికారు.
ఇది తెలుగుదేశం పార్టీలో, వారి వారి నియోజకవర్గాల్లో, అనుచరుల్లో చర్చనీయాంశంగా మారింది. తమను తొలగించడంపై ఒక్కో నాయకులు ఒక్కోలా స్పందిస్తున్నారు. వారి తొలగింపుపై ఇప్పటికీ చర్చ సాగుతోంది.

అందరికంటే ఎక్కువగా బొజ్జల గోపాల కృష్ణ రెడ్డిపై ఎక్కువ సానుభూతి కనిపిస్తోంది. ఆయన పార్టీలో సీనియర్ నేత. అయితే, ఆయన ఆరోగ్యం, కొడుకుపై అవినీతి ఆరోపణల కారణంగా పదవిని కోల్పోయారు.
తన తొలగింపుపై సోమవారం ఆయన స్పందించారు. అంతా చంద్రబాబు ఇష్టమని, పార్టీ కంటే తన ఆరోగ్యం ముఖ్యమని ఆయన చెప్పారని అన్నారు. అలాగే తన కొడుకు రాజకీయ భవిష్యత్తు పైన కూడా ఆచితూచి స్పందించారు.
ఇక, పీతల సుజాత, రావెల కిషోర్ బాబులకు వారి వారి జిల్లాల్లో నేతలతో సన్నిహిత సంబంధాలు లేవు. చంద్రబాబుకు అదే పనిగా ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో వారిని తొలగించారు. రావెల, పీతలపై వేటు పడుతుందని చాలాకాలంగా చర్చ సాగుతోంది. ఇందుకు వారు కూడా మెంటల్‌గా ప్రిపేర్ అయినట్లుగా కనిపిస్తోందంటున్నారు.
ఇక, మృణాళిని, పల్లె రఘునాథ్ రెడ్డిలు తమ మెతక వైఖరి కారణంగానే ప్రధానంగా పదవిని కోల్పోయారని అంటున్నారు. అలాగే, సామాజిక, ప్రాంతీయ లెక్కలు కూడా అందుకు దోహదపడ్డాయని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications