కేబినెట్ లో బీజేపీకి మరో బెర్తు - భారీ మార్పులు, ఆ ముగ్గురు స్థానంలో కొత్తగా...!?
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి అవుతోంది. పాలనా - రాజకీయంగా మార్పుల దిశగా కూటమి నేతలు సిద్దం అవుతున్నారు. మహానాడు ద్వారా పార్టీలో జోష్ పెంచేందుకు ప్రయ త్నించిన టీడీపీ నాయకత్వం.. ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులను త్వరగా భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇదే సమయంలో మంత్రివర్గ విస్తరణ పైన చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి పైన హామీ ఇచ్చారు. నాగబాబుతో పాటుగా బీజేపీకి మరో మంత్రి పదవి దక్కనున్నట్లు సమాచారం. ప్రస్తుత మంత్రివర్గంలోనూ మార్పులు ఉంటాయని కూటమి నేతల ద్వారా తెలుస్తోంది.
కేబినెట్ ప్రక్షాళన
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తవుతోంది. దీంతో, రాష్ట్ర మంత్రివర్గంలో మార్పుల దిశగా కసరత్తు జరుగుతోంది. మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వనున్నట్లుగా స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. ఆ తరువాత ఎమ్మెల్సీగా నాగబాబు ఎన్నికైన తరువాత మంత్రివర్గం కి తీసుకోవాలని నిర్ణయించారు. నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పటి వరకు మంత్రి పదవి ఎప్పుడనేది స్పష్టత రావటం లేదు. ఇదే సమయంలో ఏడాది పాలన సమీక్షలో భాగంగా కొందరు మంత్రుల పని తీరు పై ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో, మంత్రివర్గ ప్రక్షాళన తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మారుతున్న లెక్కలు కూటమి పాలన.. క్షేత్ర స్థాయిలో పరిస్థితుల పైన సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వంలో మార్పులకు సిద్దం అవుతున్నారు.

భారీ మార్పులు
ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఒక మంత్రి పదవి నాగబాబుకు ఇవ్వం పైనా కొత్త చర్చ వినిపిస్తోంది. బీజేపీ సైతం తమకు రెండో పదవి ఇవ్వాలని రాష్ట్ర నేతల ద్వారా రాయబారం చేసినట్లు పార్టీ నేతల సమాచారం. కేంద్రంలో బీజేపీ నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు. రాష్ట్రంలో బీజేపీకి రెండు మంత్రి పదవులు ఇవ్వాలని ప్రతిపాదించినట్లు సమాచారం. దీంతో, బీజేపీకి మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయిస్తే.. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో తొలిగింపు పైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఏడాది కాలం మంత్రుల పని తీరు పైన ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తి స్థాయిలో నివేదికలు సిద్దం చేసినట్లు తెలుస్తోంది. మంత్రులుగా తమ శాఖల పైన పట్టు.. పాలనా వ్యవహారా ల్లో పని తీరు.. పార్టీ వ్యవహారాల్లో చొరవ వంటి విషయాల ఆధారంగా మంత్రుల ప్రోగ్రెస్ కార్డులను సిద్దం చేసారు. ఈ నెల 4న జరిగే మంత్రివర్గ భేటీలో వీటిని బయట పెట్టే అవకాశం ఉంది.
ఆ ముగ్గురి స్థానంలో
ఇక, మంత్రివర్గంలో మార్పులు భారీగా ఉంటాయనే ప్రచారం ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. దీనికి అనుగుణంగా ముగ్గురు మంత్రుల పని తీరు ఆశాజనకంగా లేదని.. ఎన్ని సార్లు చెప్పినా వారి లో మార్పు రావటం లేదని చెబుతున్నారు. అందులో ఉత్తరాంధ్ర కు చెందిన మంత్రితో పాటుగా, గోదావరి జిల్లాల్లో వివాదాల్లో చిక్కుకుంటున్న మరో మంత్రి.. అదే విధంగా సీమ ప్రాంతానికి చెంది న మంత్రి పైన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యం అవసరం లేదనే చర్చ వినిపిస్తోంది. అయితే, ఏడాది మాత్రమే పాలన పూర్తి కావటంతో.. ఇప్పుడే మంత్రులను తొలిగించటం ప్రతికూల సంకేతాలు వెళ్తాయనే అభిప్రాయం వినిపిస్తోంది. వీరిని తెలిగిస్తే సామాజిక సమతుల్యత దెబ్బ తినకుండా కొత్త మంత్రులను ఖరారు చేయాల్సి ఉంది. దీంతో.. మంత్రివర్గ ప్రక్షాళన పైన సీఎం చంద్రబాబు తుది నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications