సూపర్ 6లో అదొక్కటే అమలు: అయిదింటిపై జాప్యం?
AP Cabinet meeting: ఏపీ మంత్రివర్గం నేడు సమావేశం కాబోతోంది. ఈ ఉదయం వెలగపూడి సచివాలయంలో ఈ భేటీ ఏర్పాటైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి అధ్యక్షత వహిస్తారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా, కేబినెట్ మంత్రులు ఇందులో పాల్గొంటారు.
మొన్నటి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీల అమలు గురించి మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటై నెలన్నర అవుతోంది.

ఇప్పటివరకు ఈ సూపర్ 6 అమలు చేసిన హామీ ఒక్కటే ఒక్కటి. అది- సామాజిక భద్రత కింద పింఛన్ల పెంపు మొత్తం. గతంలో 3,000 రూపాయలు ఉన్న ఆ పింఛన్ మొత్తాన్ని 4,000 రూపాయలకు పెంచింది చంద్రబాబు- పవన్ కల్యాణ్ సర్కార్. ఈ నెల 1వ తేదీన దీన్ని అమలు చేసింది.
ఇక మిగిలిన హామీలు గానీ, చేసిన సంతకాలకు గానీ ఇప్పటివరకు ఎలాంటి గ్యారంటీ లేకుండాపోయింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటివరకు విడుదల కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడానికి ఉద్దేశించిన మహాశక్తి పథకం అమలు ఊసే లేదు.
మహిళలకు ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ మాటే ఎత్తట్లేదు. ఉచిత ఇసుక అంటూ ప్రకటించినప్పటికీ.. టన్నుకు 1,400 రూపాయల మొత్తాన్ని వసూలు చేస్తోంది ప్రభుత్వం. ఆయా అంశాలన్నింటిపైనా మంత్రివర్గంలో సమీక్షించే అవకాశం ఉంది. ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్‌పై మంత్రివర్గం ఆమోదం తెలుపుతుందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications