గేరు మార్చిన చంద్రబాబు- అనూహ్య నిర్ణయం..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు స్పీడ్ పెంచారు. కూటమి ప్రభుత్వం తొమ్మిది నెలల పాలన పూర్తి కావటంతో .. కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. పాలనా పరంగా గేర్ మార్చారు. జిల్లాల పర్యటనల్లో ఆకస్మిక తనిఖీలకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే బడ్జెట్ పూర్తి కావటంతో.. కొత్త ఆర్దిక సంవత్సరం నుంచి పథకాల అమలు పై కసరత్తు జరుగుతోంది. ఇదే సమయంలో అమరావతి పై కీలక నిర్ణయాలకు ఈ రోజు జరిగే మంత్రివర్గ భేటీ కీలకంగా మారుతోంది. పలు నిర్ణయాలకు నేటి మంత్రివర్గ సమావేశం ఆమోద ముద్ర వేయనుంది.
అమరావతి పై చర్చ
ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో కొత్త మార్పు చూపించేందుకు సిద్దమయ్యారు. ఇక నుంచి మంత్రులు తన అంచనాలకు తగినట్లుగా వేగంగా పని చేయాలని స్పష్టం చేయనున్నారు. నేడు జరిగే మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాల పైన చర్చకు వచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశం తరువాత మధ్యాహ్నం క్యాబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులకు ఈ భేటీలో ఆమోదం తెలపనుంది. సీఆర్డీయే ఆమోదించిన పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది మంత్రివర్గం. దీంతో పాటుగా సీఆర్డీయే 22వేల 607 కోట్ల రూపాయలతో చేపట్టనున్న 22 పనులకు ఆమోదం తెలపనుంది. అలాగే మున్సిపల్ శాఖలోని పలు అజెండాలకు ఆమోదం తెలపే అవకాశం కనిపిస్తోంది.
పెట్టుబడుల పై చర్చ
సీఆర్డీఏ అథారిటీలో ఆమోదించిన 37,702 కోట్ల టెండర్ల పనులు చేపట్టేందుకు క్యాబినెట్ ఆమోదం తెలపనుందని తెలుస్తోంది. క్యాబినెట్ అమోదంతో టెండర్లు దక్కించుకున్న సంస్థలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు సీఆర్డీఏ జారీ చేయనుంది. అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ చేప ట్టిన రూ.15081 కోట్ల విలువైన 37 పనులకు మంత్రివర్గం ఆమోదించటం తో పాటుగా రాజధాని లో పలు సంస్థలకు భూ కేటాయిoపులకు అమోదం తెలపనుంది. మున్సిపల్ శాఖ ఎజెండాలకతో పాటుగా 4వ ఎస్ఐపిబి మీటింగ్ అమోదం తెలిపిన వాటికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. 10 సంస్థల ద్వారా వచ్చే రూ. 1,21,659 కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదించనుంది.

మంత్రులకు నిర్దేశం
ఇక..ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ నెల్లూరు జిల్లా నాయుడుపేట రూ.1,742 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దాల్మియా సిమెంట్ సంస్థ కడప జిల్లాలో రూ.2,883 కోట్ల పెట్టుబడులకు, లులూ గ్లోబల్ ఇంటర్నేషనల్ సంస్థ విశాఖపట్నం నగరంలో రూ. 1,500 కోట్ల పెట్టుబడులతో ఇంటర్నేషనల్ కన్వెషన్ సెంటర్ ఏర్పాటుకు, సత్యవీడు రిజర్వ్ ఇన్ ఫ్రాసిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ శ్రీసిటీలో రూ.25వేల కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. ఇండోసాల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ.58,469 కోట్ల పెట్టుబడులకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. జిల్లాల పర్యటనలు.. ప్రభుత్వం - పార్టీ సమన్వయం పైన చంద్రబాబు మంత్రులకు దిశా నిర్దేశం చేయనున్నారు.












Click it and Unblock the Notifications