'అన్నదాత సుఖీభవ' వారికే వర్తింపు- తాజా నిర్ణయం, మార్గదర్శకాలు..!!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సిద్దమైంది. ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో పలు ప్రధా న అంశాల పైన చర్చించి నిర్ణయం తీసుకోనుంది. అమరావతి లో పనుల పైన సీఆర్డీఏ నిర్ణయాల కు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. అన్నదాత సుఖీభవ .. తల్లికి వందనం పథకాల అమలు పైన నిర్ణయం తీసుకోవటంతో.. మార్గదర్శకాల పైన మంత్రివర్గం చర్చించనుంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన సైనికులను మంత్రివర్గం అభినందించనుంది. అదే విధంగా మంత్రుల పని తీరు పైన సీఎం చంద్రబాబు మరోసారి దిశా నిర్దేశం చేసే అవకాశం ఉంది.

కీలక నిర్ణయాలు
ఏపీ మంత్రివర్గం ఈ రోజు సచివాలయంలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో అమరావతి రీ స్టార్ట్ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోదికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపనున్నారు. 47 వ సీఆర్డీ ఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల పై ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పలు సంస్థల కు భూ కేటాయింపులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా సూపర్ సిక్స్ పథకాల్లో కీలకమైన అన్నదాత సుఖీభవ .. తల్లికి వందనం మార్గదర్శకాల పైన చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు. అన్నదాతా సుఖీభవ పథకాన్ని ఈ నెల నుంచే ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. పాఠశాలల ప్రారంభానికి ముందే తల్లికి వందనం కింద చదువుకునే పిల్లలకు రూ.15 వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ap-cabinet-to-finalise-the-guidelines-for-annadata-sukhibava-scheme

అన్నదాత సుఖీభవ అమలు
రైతులకు ప్రతీ ఏటా 20 వేల రూపాయలు ఆర్దిక సాయం అందిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలు దిశగా నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకాన్ని మూడు విడుతలుగా రైతులకు అందించనున్నారు. కౌలు రైతులకు వర్తించేలా నిర్ణయించారు. కేంద్రం పీఎం కిసాన్ కింద మూడు విడతల్లో ఇచ్చే నిధులతో పాటుగా అన్నదాత సుఖీభవ నిధులు జమ చేయనున్నారు. కాగా, ఈ పథకం అర్హతల పైన ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. వీటి పైన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని అర్హులైన ప్రతీ రైతుకు అందించాలని నిర్ణయంచారు. ఉద్యానవనం, పట్టు పరిశ్రమలకు సంబంధించిన పంటలు సాగు చేసేవారు కూడా ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు.

Take a Poll

మార్గదర్శకాలు
అన్నదాత సుఖీభవ పథకానికి పది వేలకు పైగా పెన్షన్ పొందేవారు.. ప్రభుత్వ ఉద్యోగాలు, పదవు ల్లో ఉన్న వారికి పథకం అమలు కాదు. ఆర్దికంగా రైతులకు మద్దతుగా నిలిచేందుకు అమలు చేస్తున్న ఈ పథకంలో ఇంజినీర్లు, డాక్టర్లు, లాయర్లు, ఛార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్టులు, ఇతర వృత్తి నిపుణులు ఈ పథకానికి అనర్హులు. గతేడాది పన్ను చెల్లించిన వారికి పథకం అమలు కాదు. ఇక, వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చినా ఈ పథకానికి అనర్హులుగా అధికారులు ప్రతిపాదించారు. వీటి పైన నేటి సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక.. ఈ నెల 27,28,29 తేదీల్లో జరిగే మహానాడు పైనా అధికారిక అజెండా పూర్తయిన తరువాత చర్చించే ఛాన్స్ ఉంది. మంత్రుల పని తీరు పైనా చంద్రబాబు మరోసారి దిశా నిర్దేశం చేసేందుకు సిద్దమైనట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+