ఉద్యోగులకు డీఏ- రైతుభరోసా, తల్లికి వందనంపై బిగ్ డెసిషన్..!!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సిద్దమైంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల దిశగా అడు గులు వేస్తోంది. ఉద్యోగుల అంశం తో సహా సూపర్ సిక్స్ అమలు దిశగా మంత్రివర్గ భేటీలో చర్చ చేసి.. నిర్ణయం తీసుకోనుంది. కొత్త ఏడాది ప్రారంభం వేళ ఉద్యోగాల భర్తీ .. సంక్షేమ పథకాల అమలుకు క్యాలెండర్ ఖరారు దిశగా కసరత్తు జరుగుతోంది. అదే విధంగా ఉద్యోగులకు పెండింగ్ డీఏల తో పాటుగా కొత్త పీఆర్సీ కమీషన్ ఏర్పాటు పైన నిర్ణయం దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఉద్యోగుల కోసం
రేపు (బుధవారం) ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాల కు ఆమోద ముద్ర వేయనున్నారు. ఉద్యోగులతో పాటుగా మహిళలు, రైతులకు సంబంధించి ఈ సమావేశంలో నిర్ణయాలు ఉంటాయని సమాచారం. ఉద్యోగులకు డీఏ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ సమావేశంలో ఒక డీఏ విడుదలకు ఆమోద ముద్ర వేసేందుకు రంగం సిద్దం అయింది. అదే విధంగా పీఆర్సీ కమిషన్ నియామకం పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. జగన్ ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషన్ కూటమి అధికారంలోకి రాగానే రాజీనామా చేసింది. దీంతో, కొత్త పీఆర్సీ నియామకం పైన నిర్ణయం ఉండే అవకాశం ఉంది.

AP Cabinet to take Decision over Employees IR and on implementation of Rythu Bharosa

పథకాలకు ఆమోదం
అదే విధంగా కొత్త ఏడాదిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఇప్పటికే చంద్రబాబు హామీ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు పథకం ఉగాది నుంచి అమలుకు నిర్ణయించారు. ఇదే సమయంలో రైతులకు అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాల అమలు షెడ్యూల్ ను ఈ భేటీలో ఖరారు చేస్తారని సమాచారం. ప్రభుత్వం సేకరిస్తున్న రుణాల నుంచి ముందుగా తల్లికి వందనం, లేదా రైతులకు అన్నదాత సుఖీభవ అమలుకు ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ రెండు పథకాల్లో ఎప్పుడు ఏది అమలు చేయాలనేది ఈ కేబినెట్ భేటీలో చర్చించి .. కార్యాచరణ ఖరారు చేయనున్నారు.

కీలక నిర్ణయాలు
అదే విధంగా కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్ల పైన పెద్ద సంఖ్యలో అర్హులైన లబ్దిదారులు ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. అర్హత లేకపోయినా పెన్షన్లు పొందుతున్న వారికి కోత వేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ మేరకు అనర్హులకు కోతతో పాటుగా అర్హులకు కొత్తగా మం జూరు పైన ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీకి కొత్త పెట్టబడులు.. భూ కేటాయింపు ల కు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. అమరావతి, పోలవరం పురోగతి పైన మంత్రివర్గంలో సమీక్షించనున్నారు. ఈ నెల 12న ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ విడుదలకు కేబినెట్ అనుమతి ఇవ్వనుంది. దీంతో, ఈ భేటీలో తీసుకునే నిర్ణయాల పైన ఆసక్తి కొనసాగుతోంది.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు టీడీపీ కూటమి సర్కారు నూతన సంవత్సరం కానుక అందించబోతోందా.. కొత్త ఏడాదిని పురస్కరించుకుని కొత్త పథకం అమలుకు సిద్ధమైందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. జనవరి 2వ తేదీన సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. అమరావతిలోని సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం భేటీ కానుంది. ఈ సమావేశంలో పలు విషయాలపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+