ఎపిలో విస్తరిస్తున్న హైటెక్ వ్యభిచారం....రాజధాని ప్రాంతంలో వెలుగుచూసిన న్యూ టైప్ ప్రాస్టిట్యూషన్

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

గుంటూరు: ఎపి రాజధాని ప్రాంతంలో వ్యభిచార నిర్వాహకులు కొత్తపుంతలు తొక్కుతున్నారు. తమ బిజినెస్ పెంచుకోవడానికి టెక్నాలజీని జోరుగా వాడుకుంటున్నారు. ఈజీగా విటులను, కాల్ గర్ల్స్ ను కలిపి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి ముఠాకు చెందిన ఒక వ్యక్తి గుంటూరు పోలీసులకు పట్టుబడటంతో హైటెక్ వ్యభిచారం బండారం బైటపడింది.

గుంటూరులో వెలుగు చూసిన ఈ అడ్వాన్స్ డ్ సెక్స్ రాకెట్ టెక్నాలజీ చూసి పోలీసులే విస్తుపోయారు. ఆన్ లైన్ లో కాల్ గర్ల్స్, వైబ్ సైట్ లో బుకింగ్, నచ్చిన చోట ముచ్చట తీర్చుకోవడం ఇవన్నీఎక్కడో విదేశాల్లోనో, లేదంటే మెట్రోపాలిటన్ సిటీల్లోనో జరుగుతుందని వారి ఊహ. కానీ పట్టణానికి ఎక్కువ నగరానికి తక్కువ లాంటి కల్చర్ తో ఉండే గుంటూరులో సైతం జోరుగా హైటెక్ ప్రాస్టిస్ట్యూషన్ సాగుతుందని తెలిసి ఆశ్చర్యపోయారు.

ఎవరు? ఎక్కడంటే?..

ఎవరు? ఎక్కడంటే?..

విశాఖజిల్లా మాకవారిపాలెం మండలం జంగాలపల్లికి చెందిన ఇటంశెట్టి సూర్యవెంకట శివప్రసాద్‌ అలియాస్‌ బాలాజీ ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు. ఆ లింకులోకి వెళ్లి కాల్‌గల్స్‌ ఇన్‌ గుంటూరు లేదా నెల్లూరు...లేదా ఇలా వివిధ పట్టణాల పేర్లు ఉంటాయి. ఆ ఊరి పేరును ప్రెస్ చేస్తే అందమైన అమ్మాయిల ఫొటోలు కనిపిస్తాయి. వారి ఫోటోల పక్కనే ఫోన్ నంబరు ఉంటుంది. ఆ నంబరుకు ఫోన్‌ చేస్తే ఎలాంటి అమ్మాయి కావాలి? ఎంత సేపు కావాలి? ఇలా కస్టమర్ అవసరాలను తెలుసుకొని శివప్రసాద్‌ ఆ తర్వాత బేరానికి దిగుతాడు. అవతలి నుంచి ఒకే అనగానే క్యాష్ పేమెంట్ ఆన్‌లైన్‌లోనే చేసెయ్యడానికి ఒక అకౌంట్‌ నెంబరు చెబుతాడు. డబ్బు ఖాతాలో పడిందని కన్ ఫామ్ చేసుకున్నాక కస్టమర్ కోరిన ప్రాంతంలో మహిళా ఏజెంట్‌ ఫోన్‌ నెంబరు ఇస్తాడు. ఆమెకు ఫోన్‌ చేయగానే విటులు కోరిన విధంగా అరేంజ్‌మెంట్ జరుగుతుంది.

ఇప్పటివరకు ఎక్కడెక్కడంటే...

ఇప్పటివరకు ఎక్కడెక్కడంటే...

ఈ ఆన్‌లైన్‌ వ్యభిచారానికి విశాఖ, గుంటూరు, నెల్లూరు, తిరుపతిని వ్యాపార కేంద్రాలుగా శివప్రసాద్‌ ఎంచుకున్నాడు. గతంలో ఒక వ్యభిచార నిర్వాహకుడి దగ్గర పనిచేసిన అనుభవం ఉండటంతో దానికి టెక్నాలజీని జోడించి 4 నెలల క్రితమే ఆన్‌లైన్‌ ప్రాస్టిస్ట్యూషన్ కు తెరతీశాడు. ఆయా జిల్లాల్లో గతంలో వ్యభిచారం నిర్వహించిన మహిళలే ప్రస్తుతం ఇతని ఏజెంట్లు. ఈ నాలుగు పట్టణాల్లో శివప్రసాద్‌కున్న నెట్‌వర్క్‌ను చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు.

సెక్స్ రాకెట్ ఇలా బైటపడింది...

సెక్స్ రాకెట్ ఇలా బైటపడింది...

సాధారణ దాడుల్లో భాగంగా గుంటూరు కొత్తపేట పోలీసులు ఒక వ్యభిచార గృహంపై దాడి చేయగా ఈ ఆన్‌లైన్‌ వ్యభిచారం గుట్టు బైటపడింది. ఈ నెట్ వర్క్ లో కాల్ గర్ల్స్ గా పనిచేస్తున్న రాజమండ్రి, విజయవాడ, గుంటూరుకు చెందిన ముగ్గురు యువతులను ఉజ్వల హోమ్‌కు తరలించారు. అన్నపరెడ్డి వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, ఓరుగంటి సాయిభరత్‌ అనే నిర్వాహకులను అరెస్టు చేశారు. వీరిచ్చిన సమాచారంతో ఈస్ట్‌ డీఎస్పీ కండే శ్రీనివాసులు ఆధ్వర్యంలో కొత్తపేట సీఐ వంశీధర్‌ ఇతర పోలీసులు ఒక బృందంగా ఏర్పడి శివప్రసాద్‌ను, గుంటూరులో అతనికి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న అన్నపరెడ్డి దుర్గ, అన్నపరెడ్డి పద్మావతి అలియాస్‌ వెంకట పద్మ, తిరుపతిలోని మారుతీనగర్‌కు చెందిన గోవింద, సరోజ అనే మహిళలను కూడా అరెస్టు చేశారు.

పోలీసులకే షాక్..

పోలీసులకే షాక్..

ఈ హైటెక్ పద్దతిలో ప్రాస్టిస్ట్యూషన్ ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా, నిర్వాహకులను వెతుక్కునే శ్రమ లేకుండా ఆన్‌లైన్‌లోనే కాల్‌గల్స్‌ను బుక్ చేసుకునే సదుపాయం కల్పిస్తూ ఈ బద్మాష్ గాళ్లు ఈజీ మనీ సంపాదిస్తున్న వైనం పోలీసుల్లో చర్చనీయాంశం అయింది. ఇలాంటి వెబ్‌సైట్లు అనేకం ఉంటాయని తెలిసినప్పటికి ఏపీని బేస్ చేసుకొని పనిచేస్తున్నఈ తరహా సెక్స్ రాకెట్ వెలుగుచూడటం ఇదే మొదటిసారని పోలీసులు అంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In the AP Capital region, the prostitution organizers are keen on the technology. They increase their business with this technology by using as a tool. The high-tech prostitution organisers was caught by the police in Guntur. Guntur kottapeta police attacked an adulterous house as part of the common attacks, and the online adulteration was out.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి