అనూహ్యం: బాబుకు ప్రధాని మోడీ ఫోన్, 20 ని.లు చర్చ, సీఎంకు షాకిచ్చారా.. రాజీనామా చేస్తారా?
Recommended Video

అమరావతి/న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేశారు. ఇరువురు దాదాపు పది నిమిషాలు మాట్లాడుకున్నారు.
మంత్రులు రాజీనామాలు, విభజన హామీలు, తాజా రాజకీయ పరిస్థితులపై 10 నుంచి 20 నిమిషాలు చర్చించారు. బుధవారం రాత్రి ప్రధానికి ఫోన్ చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. కానీ అందుబాటులోకి రాలేదు.

కేంద్రమంత్రుల రాజీనామాకు కారణాలు వివరణ
కేంద్రమంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిలు రాజీనామాకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకు వెళ్లారని తెలుస్తోంది. తమ పార్టీ మంత్రులు రాజీనామా చేస్తారని చెప్పారని తెలుస్తోంది.

కేంద్రమంత్రులు ఎందుకు రాజీనామా చేస్తున్నారంటే
తమ పార్టీకి చెందిన కేంద్రమంత్రులు ఎందుకు రాజీనామా చేస్తున్నారు అనే విషయమై చంద్రబాబు ప్రధానికి వివరించారని తెలుస్తోంది. ప్రత్యేక హోదా, విభజన హామీలు అంశంపై రాజీనామాకు సిద్ధమైనట్లు చెప్పారని తెలుస్తోంది.

హోదా ఇవ్వకుంటే ఇబ్బందికరమే
ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీపై ఏపీ ప్రజలు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారని మోడీకి చంద్రబాబు వివరించినట్లుగా తెలుస్తోంది. హోదా సెంటిమెంట్ ప్రజల్లో బాగా నాటుకు పోయిందని ఆయన వివరించారని సమాచారం. ఏపీకి హోదా ఇవ్వకుంటే ఇబ్బందికర పరిణామాలు ఉంటాయని చెప్పారని తెలుస్తోంది.

హోదాపై హామీ ఇవ్వని మోడీ?
ఏపీకి చట్టంలో చెప్పిన వాటిని అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, వాటిని ఒక్కటొక్కటిగా నెరవేరుస్తున్నామని, మరింత వేగవంతం చేస్తామని చంద్రబాబుతో ప్రధాని మోడీ చెప్పారని తెలుస్తోంది. ప్రత్యేక హోదా విషయంలో మాత్రం చంద్రబాబుకు హామీ ఇవ్వలేదంటున్నారు. హోదా బదులు ప్యాకేజీ ఇస్తున్నామని చెప్పారని తెలుస్తోంది. చంద్రబాబుకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఆయన ససేమీరా అన్నారని తెలుస్తోంది.

కేంద్రమంత్రులు రాజీనామా చేస్తారా
అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిలు సాయంత్రం ఆరు గంటలకు ప్రధాని మోడీని కలవనున్నారు. వారు తమ రాజీనామా పత్రాలు సమర్పించేందుకు ఉదయం నుంచి ప్రధాని అపాయింటుమెంట్ కోసం వేచి చూస్తున్నారు. ఆరుగంటలకు కలిసి రాజీనామా పత్రాలు సమర్పిస్తారా లేదా మోడీ ఫోన్ చేసినందున తగ్గుతారా అనేది సస్పెన్స్‌గా మారింది.












Click it and Unblock the Notifications