ఎన్నికల వేళ ఏపీలో డ్వాక్రా సంఘాలకు సంబంధించి సిఈవో స్వీట్ వార్నింగ్!!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుండడంతో, ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రేపటి నుంచి కొనసాగనుంది. ఈ క్రమంలో ఏపీలో ఎన్నికల వేళ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వ సలహాదారులు రాజకీయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని, రాజకీయ విమర్శలు చేయకూడదని వార్నింగ్ ఇచ్చింది ఈసీ.

ఆ అధికారులకు డ్వాక్రా మహిళల విషయంలో స్వీట్ వార్నింగ్ ఇచ్చిన సిఈవో
ఇక స్వయం సహాయక డ్వాక్రా సంఘాల సభ్యులను ప్రభావితం చేసేలా ఎటువంటి కార్యక్రమాలను నిర్వహించకూడదని, డ్వాక్రా గ్రూపులను ఉద్దేశించి కీలక ఆదేశాలు ఇచ్చారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, పరిపాలక పట్టణ అభివృద్ధి శాఖలలోని అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ఎవరైనా స్వయం సహాయక సంఘాల సభ్యులతో ఏ కార్యక్రమాలు నిర్వహించినా ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కిందికే వస్తుందని ముకేష్ కుమార్ మీనా అన్నారు.

AP CEO Mukesh kumar MEENA Sweet warning to officials over dwakra groups

వారిపై రాజకీయ పార్టీల ప్రభావం
డ్వాక్రా గ్రూపులో సభ్యులను వ్యక్తిగతంగా, సమూహంగా ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా మార్చేలా, లేదా వ్యతిరేకంగా ప్రభావితం చేసేలా సమీకరణ చేయడం తప్పని, డ్వాక్రా గ్రూపుల వద్ద సర్వే కార్యక్రమాలు కూడా నిర్వహించడం చేయకూడదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముకేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ నిబంధనల అమలు అయ్యేలాగా సెర్ఫ్ సీఈవో, మెప్మా డైరెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.

మహిళల గౌరవం విషయంలో ఈసీ వైఖరి ఇదే
ముఖ్యంగా మహిళల గౌరవం విషయంలో కూడా ఎన్నికల సంఘం కఠిన వైఖరి అవలంబిస్తోందని, మహిళల గౌరవానికి భంగం కలిగేలా ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని పేర్కొన్నారు. ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు మహిళలపై చేస్తే వారికి నోటీసులు ఇచ్చి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు.

రేపటి నుండే నామినేషన్ల ప్రక్రియ.. బీ అలెర్ట్
ఇక ఇదే సమయంలో రేపు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతున్న క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో నామినేషన్లు దాఖలుకు , అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని, శాంతి భద్రతల పరిరక్షణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+