వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ చేసిన తప్పు అదే ఐతే...మరి మీరు చేసిందేంటి బాబూ?...

|
Google Oneindia TeluguNews

టిడిపి అధినేత చంద్రబాబు ఈ విడత అధికారం చేపట్టిన నాటినుంచి రాజకీయంగా ఒక విచిత్రమైన పరిస్థితి వెంటాడుతోంది. అదేమిటంటే రాజకీయ పరిస్థితుల కారణంగా ఏ పార్టీ నైనా విమర్శిద్దామని చూస్తే అచ్చం అదే విమర్శ తనకూ వర్తిస్తోంది.

అయినా పట్టించుకోకుండా అనాల్సింది అనేస్తే తాను ఎవర్నయితే టార్గెట్ చేశారో వాళ్లు మాత్రమే కాకుండా మిగిలినవాళ్లు కూడా అలెర్టయి...ఆ విమర్శ చంద్రబాబుకే వర్తిస్తుందని ఎదురుదాడికి దిగుతున్నారు. తాజాగా అలాంటి పరిస్థితే పవన్ కళ్యాణ్ విషయంలో చంద్రబాబు మరోసారి ఎదుర్కొంటున్నారు. పవన్ మొన్నటిదాకా మనతోనే ఉండి, ఇప్పుడు ఉన్నట్టుండి మనల్ని తిట్టడమే పవన్ చేసిన తప్పు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే ఈ వార్త అలా వెలువడిందో లేదో నెటిజన్లు వెంటనే రియాక్ట్ అయారు...మరి బిజెపి విషయంలో మీరు చేసింది...చేస్తుందీ అదే కదా బాబు అని ప్రశ్నిస్తున్నారు. వివరాల్లోకి వెళితే...

 పవన్ పై చంద్రబాబు విసుర్లు...

పవన్ పై చంద్రబాబు విసుర్లు...

కేంద్రంపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా సోమవారం ఉదయం టిడిపి ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు...ఈ సందర్భంగా మాట్లాడుతూ
బీజేపీతో వైసీపీ కుమ్మక్కైందనే విషయం అందరికీ అర్థమైందని అన్నారు. అలాగే బీజేపీ, జగన్, పవన్ కల్యాణ్ లు చేస్తున్న తప్పులన్నీ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పవన్ పెద్ద తప్పు చేశారని...మొన్నటిదాకా మనతోనే ఉండి, ఇప్పుడు మనల్ని తిట్టడమే పవన్ చేసిన అతి పెద్ద తప్పు అని చంద్రబాబు అన్నారు.

 బాబు తాజా వ్యాఖ్యలు...నెటిజన్ల ప్రశ్నలు...

బాబు తాజా వ్యాఖ్యలు...నెటిజన్ల ప్రశ్నలు...

అయితే చంద్రబాబు లేటెస్ట్ కామెంట్లు అలా జనంలోకి వెళ్లాయో లేదో వెంటనే ఇటు జనసేన, అటు వైసిపి అభిమానులైన నెటిజన్లు వెంటనే స్పందించారు. పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చంద్రబాబు ఏవైతే వ్యాఖ్యలు చేశారో అచ్చుగుద్దినట్లు అవి ఆయనకూ వర్తిస్తాయని ఎద్దేవా చేస్తున్నారు. చంద్రబాబు నాలుగేళ్లు బిజెపితో అంటకాగి...కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి...వారేం చెప్పినా ఎదురు మాట్లాడకుండా...ప్రతిదానికీ ఆహా...ఒహో అని పొగిడి...రాష్టానికి రావాల్సిన ప్రయోజనాలు ఏవీ రాకపోతున్నా వెనకేసుకొచ్చి...ఇప్పుడు హఠాత్తుగా అంతా తప్పు బిజెపిదే అనడం కరెక్టేనా...పవన్ కళ్యాణ్ ది తప్పయితే...చంద్రబాబు చేసింది ఇంకా పెద్దతప్పని విమర్శిస్తున్నారు.

మొదటినుంచీ ఇంతే...గుర్తు చేస్తున్నారు...

మొదటినుంచీ ఇంతే...గుర్తు చేస్తున్నారు...

ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన విషయమై టిఆర్ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన చంద్రబాబు సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించిన సంగతి తెలిసిందే...అయితే ఆ విషయమై టిఆర్ఎస్ ను అంతగా విమర్శించిన చంద్రబాబు...తీరా తాను అచ్చంగా అదే పని ఎపిలో చేశారని వైసిపి మద్దతుదారులు విమర్శిస్తున్నారు. అదిమొదలుకొని నేటి వరకు రాజకీయంగా ప్రాజెక్టుల విషయమైతేనేమి...ఫిరాయింపుల విషయమైతేనేమి...ప్రలోభాల విషయమైతేనేమి...అవినీతి ఆరోపణల విషయమైతేనేమి...అధికారులపై దాడుల విషయమైతేనేమి...ప్రతి విషయంలో ఏ పార్టీని విమర్శించాలన్నా ప్రతి సందర్భంలో అవే విమర్శలూ తననూ విమర్శించే అవకాశం ఉండటం చంద్రబాబుకు పెద్ద మైనస్ గా మారింది.

 బాబు వ్యాఖ్యలపై...మండిపడుతున్న బిజెపి...

బాబు వ్యాఖ్యలపై...మండిపడుతున్న బిజెపి...

మరోవైపు తప్పంతా తమ మీద వేసి తప్పుకోవాలని చూస్తున్న టిడిపి అధినేత చంద్రబాబుపై బిజెపి ఎదురుదాడి చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అస్సలు స‌హ‌కరించ‌డం లేదని, ఇన్నాళ్లూ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కోస‌మే పొత్తులో కొన‌సాగామ‌ని చంద్రబాబు చెబుతున్నారు. ఇక ఉపేక్షించేది లేదంటూ బీజేపీ తీరుపై ఆయన మండిపోతున్నారు. మరోవైపు బిజెపి ఇటు వైసీపీతో క‌లిసిపోయింద‌ని, ప‌వ‌న్‌తో అటు కుమ్మ‌కు అయిందంటూ ప్ర‌చారం కూడా చేస్తున్నారు. హోదా కాక ప్యాకేజీ ఇస్తా మంటే ఒప్పుకుని స‌న్మానాలు చేసి, అభినందన తీర్మానాలు పెట్టి.. ఇన్ని చేసిన చంద్ర‌బాబు.. చివ‌ర‌కు బీజేపీని బోనులో నిల‌బెట్టేశార‌ని బీజేపీ నేత‌లు ఆగ్ర‌హంతో ర‌గిలిపోతున్నారు. అంతేగాక ఇన్నాళ్లూ త‌మ‌తో ఉండి ల‌బ్ధి పొంది...చివ‌ర‌కు త‌మనే ముద్దాయిలా మార్చేందుకు చంద్రబాబు చేస్తున్న ప్ర‌య‌త్నాలపై బీజేపీరగిలిపోతోంది.

ఇక చంద్రబాబుపై...బిజెపి ఎదురుదాడి

ఇక చంద్రబాబుపై...బిజెపి ఎదురుదాడి

దీంతో చంద్రబాబుపై ఎదురుదాడి చేయాల‌ని బిజెపి అధిష్టానం నిర్ణయించిందట. ఈ మేరకు పార్టీ శ్రేణుల‌కు బీజేపీ అధ్య‌క్షుడు అమిత్‌షా దిశానిర్దేశం కూడా చేశారట. తమ అధిష్టానం నుంచి కూడా చంద్రబాబును టార్గెట్ చేయాలంటూ సూచనలు రావడంతో ఇక టిడిపికి ఎపి బిజెపి నేతలు చుక్కలు చూపిస్తారంటున్నారు. కేంద్రంపై టీడీపీ చేస్తున్నవిమర్శలను వెంటనే తిప్పికొట్టాలని, విమర్శలకు వెంటనే ప్రతివిమర్శలు చేయాలని, దూకుడుగా వ్యవహరించాలని అమిత్‌ షా పార్టీ శ్రేణులకు ఆదేశించినట్లు చెబుతున్నారు. ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్న సీఎం చంద్రబాబు...ఇప్పుడు మళ్లీ ఎలా మాటమార్చి కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారో ప్రజలకు సమగ్రంగా వివరించాలని ఆదేశించారు. టీడీపీ తమకు ఇప్పుడు మన మిత్రపక్షం కాదని, ప్రతిపక్షం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అమిత్ షా స్పష్టం చేసినట్లు అంటున్నారు. దీంతో బిజెపి కేవలం మాటల దాడే చేస్తుందా? లేక తమ ఆరోపణలకు ఆధారాలు వంటి వాటిని తెచ్చి చూపించడం ద్వారా చంద్రబాబును బుక్ చేయాలని చూస్తుందా? అనే విషయం స్పష్టత మరి కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.

English summary
The any criticism to the opponents...is that he must face the same criticism has must be face now in the episode of Chandrababu. Nates are also criticizing Chandrababu's remarks for Pawan Kalyan.Recently, Pawan Kalyan has been criticized by Chandrababu...those criticisms that will apply to Chandrababu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X