కౌంటర్! తెలంగాణ వాహనాలకు ఏపీలో ట్యాక్స్ పన్ను
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వాహన ట్యాక్స్ వివాదం ఇటీవల రాజుకున్న విషయం తెలిసిందే. తమ రాష్ట్రంలోకి వచ్చే ఏపీ వాహనాలకు తెలంగాణ రాష్ట్రం ట్యాక్స్ వసూలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలంగాణ వాహనాలకు వసూలు చేయాలని భావిస్తోంది.
తెలంగాణలో రిజిస్టర్ అయి ఏపీకి వచ్చే రవాణా వాహనాలకు పన్ను వసూలుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం కోసం ఏపీ రవాణా శాఖ ఎదురు చూస్తోంది.

తెలంగాణ వాహనాలకు ఏపీలో రవాణా పన్ను వసూలు ప్రతిపాదన దస్త్రం సీఎం కార్యాలయానికి గురువారం చేరింది. గురువారం నాడు చంద్రబాబు మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు వెళ్లడంతో ఈ దస్త్రాన్ని సీఎం శుక్రవారం లేదా మరో ఒకటి రెండు రోజుల్లో పరిశీలించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం.
ఇసుక రీచ్‌లలో సీసీ కెమెరాలు: చినరాజప్ప
మూడు నెలల్లో ఇసుక రీచ్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి చినరాజప్ప వెల్లడించారు. అమరావతిలో ప్రపంచస్థాయి రాజధాని నిర్మించనున్నట్లు చెప్పారు. ప్రాజెక్టులు పూర్తి చేసి, రాయలసీమను సస్యశ్యామలం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మారిషస్‌లో బెయిల్ రాగానే గంగిరెడ్డిని ఏపీకి తీసుకువస్తామన్నారు. కొందరు రాజకీయ నేతల అండతోనే ఎర్రచందనం మాఫియా సాగుతోందన్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications