YSRCP: ఈర్ష్య, ద్వేషంతో రగిలిపోతున్న AP ముఖ్యమంత్రి జగన్?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఔట్‌డేటెడ్ లీడరని పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. అన్నారు అనేకన్నా నోరుజారారు అనడం మంచిది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై అన్యాపదేశంగా విమర్శలు చేస్తున్న కారుమూరి నోరుజారి తమ ముఖ్యమంత్రినే ఔట్‌డేటెడ్ లీడర్‌గా అభివర్ణించారు.
సామాజిక న్యాయభేరి పేరుతో బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులు బస్సు యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ యాత్ర మహానాడు నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికేననేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మూడోరోజు కృష్ణా జిల్లా గన్నవరం వచ్చిన తర్వాత మంత్రి మాట్లాడుతూ జగన్ ఔట్‌డేటెడ్ లీడర్ అనడంతో సభలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు అవాక్కయ్యారు.

గన్నవరం సభలో త్రి కారుమూరి నాగేశ్వరరావు ఆవేశంగా ప్రసంగించారు. జగన్ బీసీలకు అన్ని పనులు చేసిపెడుతుంటే చంద్రబాబు చూసి తట్టుకోలేకపోతున్నారంటూ చంద్రబాబును విమర్శించే క్రమంలో కుళ్లు, కుతంత్రం, ఈర్ష్య, ద్వేషంతో వ్యవహరిస్తున్న జగన్మోహన్‌రెడ్డి ఔట్‌డేటెడ్ లీడర్ అయిపోయారంటూ అభివర్ణించారు. అనంతరం తప్పు మాట్లాడానని తెలుసుకున్న మంత్రి సర్దుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ అందరికీ మంచి చేస్తున్నారని, ఆయనకు అందరూ అండగా ఉండాలంటూ విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications