సీఎం జ‌గ‌న్‌కు నిద్ర‌లేకుండా చేస్తున్న "ఆ న‌లుగురు"!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు ఆ న‌లుగురు. ఎటువంటి ప‌రిస్థితుల్లోనైనా గ‌త ఎన్నిక‌ల్లోనే వారిని ఓడించాల‌ని చూసిన‌ప్ప‌టికీ సాధ్య‌ప‌డ‌లేదు. ఈసారి వారు ఓట‌మి పాల‌వ్వాలంటే ఎటువంటి వ్యూహాలు అవ‌లంబించాలి? అనే విష‌యంలో జ‌గ‌న్ త‌ల‌మున‌క‌లై ఉన్నారు. వారిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన‌వారు.. మ‌రొక‌రు వారి కుటుంబ మ‌ద్ద‌తుదారు.

శ్రీకాకుళం జిల్లాకు పెట్టని కోట.. కింజరాపు కుటుంబం..

శ్రీకాకుళం జిల్లాకు పెట్టని కోట.. కింజరాపు కుటుంబం..

కింజ‌రాపు కుటంబాన్ని ఓడించాల‌నే గ‌ట్టి ప‌ట్టుద‌ల‌ను గ‌త ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్ర‌ద‌ర్శించిన‌ప్ప‌టికీ ప్ర‌జాబ‌లం ఎక్కువ‌గా ఉండ‌టంతో వారే విజ‌య‌ప‌తాకాన్ని ఎగ‌ర‌వేశారు. టెక్క‌లి నుంచి కింజ‌రాపు అచ్చెన్నాయుడు, రాజ‌మండ్రి నుంచి ఆదిరెడ్డి భావానీ (ఎర్రన్నాయుడి కుమార్తె), శ్రీ‌కాకుళం ఎంపీగా కింజ‌రాపు రామ్మోహ‌న్‌నాయుడు, ఇచ్ఛాపురం నుంచి అశోక్ బెందాళం గెలుపొందారు.

మూడు సంవ‌త్స‌రాల నుంచే ముఖ్య‌మంత్రి ఈ నాలుగు స్థానాల‌పై ఒక వ్యూహాన్ని రూపొందించార‌ని వైసీపీ నేత‌లు చెబుతున్నారు. అచ్చెన్నాయుణ్ని మాత్రం ఈసారి ఎట్టి ప‌రిస్థితుల్లోను అసెంబ్లీలోకి అడుగుపెట్టించ‌కూడ‌ద‌న్న‌దే ఆ పార్టీ ల‌క్ష్య‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం చెబుతున్నారు.

అచ్చెన్నాయుణ్ని ఓడించలేరంటున్న తెలుగుదేశం

అచ్చెన్నాయుణ్ని ఓడించలేరంటున్న తెలుగుదేశం

అచ్చెన్నాయుడి శ‌రీరాకృతిపై కూడా కామెంట్లు చేయ‌డానికి కార‌ణం.. మాన‌సికంగా బ‌ల‌హీనుణ్ని చేయాల‌నే ఉద్దేశ‌మ‌ని తెలుగుదేశం పార్టీ నేత‌లు వైసీపీ నేత‌ల‌పై ధ్వ‌జ‌మెత్తుతున్నారు. ఎన్ని వ్యూహాలు ప‌న్నిన‌ప్ప‌టికీ అచ్చెన్నాయుణ్ని ఓడించ‌లేర‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. 2019లో జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన‌ప్ప‌టినుంచి త‌మ నేత‌ను నిలువ‌రించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.

అచ్చెన్నాయుడికి అవమానం

అచ్చెన్నాయుడికి అవమానం

ప్ర‌ధాన‌మంత్రి మోడీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా హెలిప్యాడ్ వ‌ద్ద‌కు అచ్చెన్నాయుణ్ని నిరాక‌రించ‌డంద్వారా ప్ర‌భుత్వం ఆయ‌న‌పై పైచేయి సాధించిన‌ట్లైంద‌ని భావిస్తున్నారు. అయితే పిలిచి అవ‌మానించ‌డం ఎంత‌మాత్రం భావ్యంకాద‌ని టీడీపీ వ‌ర్గాలంటున్నాయి. విప‌క్ష పార్టీల‌ను క‌లుపుకుపోవాల్సిన కార్య‌క్ర‌మంలో వివ‌క్ష చూపించ‌డం ఎంత‌మాత్రం త‌గ‌ద‌ని హిత‌వు ప‌లుకుతున్నాయి.

ఏదేమైన‌ప్ప‌టికీ కంట్లో న‌లుసుగా మారిన దివంగ‌త ఎర్ర‌న్నాయుడి కుటుంబ స‌భ్యుల‌ను మాత్రం ఈసారి ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితుల్లోను ఓడించాల‌నే గ‌ట్టి ప‌ట్టుద‌ల‌ను ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్ర‌ద‌ర్శిస్తున్నారు. మ‌రి ఎంత‌వ‌ర‌కు విజ‌య‌వంత‌వుతారో వేచిచూడాలి..!!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+