ప్ర‌ధాన‌మంత్రి ప‌ర్య‌ట‌న‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను సీఎం జ‌గ‌న్ త‌క్కువ అంచ‌నా వేశారే??

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ పెద అమిరం గ్రామంలో స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు అల్లూరి సీతారామరాజు 30 అడుగుల భారీ కాంస్య విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా ప‌లువురు ప్ర‌ముఖుల‌కు ప్రొటోకాల్ విష‌యంలో అవ‌మానం ఎదురైందంటూ వివాదాలు వ‌చ్చాయి. తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు పేరు కేంద్ర జాబితాలో ఉన్న‌ప్ప‌టికీ రాష్ట్ర జాబితాలో లేక‌పోవ‌డంతో హెలిప్యాడ్ వ‌ద్ద‌కు అనుమ‌తించ‌లేదు. ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు బ‌య‌లుదేరి కూడా బేగంపేట స్టేష‌న్‌లో దిగిపోయారు.

అచ్చెన్నాయుకు ఎదురైందే త‌న‌కు కూడా అని భావించి..

అచ్చెన్నాయుకు ఎదురైందే త‌న‌కు కూడా అని భావించి..

చిరంజీవి వ‌చ్చారు.. మోడీ, జ‌గ‌న్ ఇద్ద‌రూ ఆయ‌న్ను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. మంత్రి రోజా సెల్ఫీ దిగించింది. బీజేపీ మిత్ర‌ప‌క్ష‌మైన జ‌న‌సేన పార్టీని కూడా ఆహ్వానించారు. పార్టీ త‌ర‌ఫున ఇద్ద‌రు ప్ర‌తినిధుల‌ను జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ పంపించారు. అచ్చెన్నాయుడుకైనా, ర‌ఘురామ‌కైనా, మ‌రొక‌రికైనా ఎదురైన అవ‌మానం త‌న‌కు కూడా ఎదుర‌వుతుంద‌ని ప‌వ‌న్ భావించిన‌ట్లు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. అందుకే ప్ర‌ధాన‌మంత్రి ప‌ర్య‌ట‌న అయిన‌ప్ప‌టికీ అవ‌మానం ఎదుర‌వుతుంద‌నే ఉద్దేశంతోనే ఆగిపోయిన‌ట్లు భావిస్తున్నారు.

జ‌గ‌న్‌తో వేదిక పంచుకోవ‌డం ఇష్టంలేకే??

జ‌గ‌న్‌తో వేదిక పంచుకోవ‌డం ఇష్టంలేకే??

అంతేకాదు.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై మొద‌టినుంచి తీవ్ర‌స్థాయిలో ప‌వ‌న్ మండిప‌డుతున్నారు. అటువంటి సంద‌ర్భంలో తాను వేదిక పంచుకోవ‌డంతోపాటు కార్య‌క్ర‌మం చివ‌రి వ‌ర‌కు ఉండ‌టం ఇష్టంలేకే ప‌వ‌న్ గైర్హాజ‌రైన‌ట్లు సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌లు సైతం అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్ర‌భుత్వ ప‌రంగా హెలిప్యాడ్ వ‌ద్ద‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరున్న‌ప్ప‌టికీ ఆయ‌న వెళ్ల‌లేదు. వెళ్లి అవ‌మానం పాల‌వ్వాల‌ని భావించ‌లేద‌ని ఆయ‌న అభిమానులు చెబుతున్నారు.

ముందుగానే గౌర‌వాన్ని కాపాడుకున్న ప‌వ‌న్‌!!

ముందుగానే గౌర‌వాన్ని కాపాడుకున్న ప‌వ‌న్‌!!

అచ్చెన్నాయుడుకు ఎదురైందే.. ర‌ఘురామ‌కు ఎదురైందే త‌మ నేత‌కు కూడా క‌చ్చితంగా ఎదుర‌య్యేద‌ని, అందుకే ముందుగానే గౌర‌వం కాపాడుకున్నామంటున్నారు జ‌న‌సేన శ్రేణులు. తిరుప‌తి లోక్‌స‌భ ఉప ఎన్నిక త‌ర్వాత బీజేపీ జ‌న‌సేన పేరు ప్ర‌స్తావించ‌డంలేదు. ఏ కార్య‌క్ర‌మానికి ఆహ్వానించ‌డంలేదు. ఇద్ద‌రి మ‌ధ్యా పొత్తు ఉందో? లేదో? తెలియ‌ని ప‌రిస్థితి. క‌రోనా వ‌ల్ల భౌతిక దూరం వ‌చ్చింద‌ని, క‌రోనా త‌గ్గిపోగానే ఇద్ద‌రి మ‌ధ్యా దూరం త‌గ్గిపోతుంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌రోక్షంగా దూరం పెరిగిన‌ట్లు అంగీక‌రించారు. ఏది ఏమైన‌ప్ప‌టికీ ప్ర‌ధాన‌మంత్రి ప‌ర్య‌ట‌న‌కు దూరంగా ఉండి త‌న గౌర‌వాన్ని కాపాడుకున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను ఆయ‌న అభిమానులు, పార్టీ శ్రేణులు అభినందిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+