ఆ 7 గంటలపాటు వారితోనే, బాబు పర్యటన రహస్యమిదే!

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ విమానాశ్రయం నండి 7 గంటలపాటు కన్పించకుండా ఏం చేశారనే ఉత్కంఠ నెలకొంది. అయితే ఆ ఏడు గంటలపాటు కూడ చంద్రబాబునాయుడు రాష్ట్రంలో పెట్టుబడులను రాబట్టేందుకు ప్రయత్నాలు సాగించారని అధికారవర్గాల సమాచారం ఆధారంగా తెలుస్తోంది.

అమెరికా పర్యటనను ముగించుకొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీకి తిరిగిరాగానే 7 గంటలపాటు ఎవరికీ కన్పించకుండా రహాస్యంగా పర్యటించారనే విషయమై సర్వత్రా చర్చసాగుతోంది.

chandrababu naidu

అయితే ఈ విషయమై పలువురు పలురకాలుగా అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఏడుగంటలపాటు కూడ చంద్రబాబునాయుడు రాష్ట్రానికి అవసరమైన పెట్టుబడుల విషయమై చర్చించారని అధికారుల సమాచారం ఆధారంగా తెలుస్తోంది.

కొన్ని ప్రత్యేక కారణాలవల్లే ఈ 7 గంటలపాటు ఎక్కడ ఉన్నారనే విషయాలను వెల్లడించడం లేదని అధికారుల వర్గాల సమాచారం ఆధారంగా తెలుస్తోంది.శుక్రవారం మధ్యాహ్నం రెండున్నరగంటల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమెరికా నుండి ఢిల్లీకి తిరిగివచ్చారు.

ముందుగా ఉన్న షెడ్యూల్ ప్రకారంగానే ఎయిర్ బస్, కువైట్ కు చెందిన ఆయిల్ కంపెనీలతో సీఎం చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. గత రెండున్నరఏళ్ళకుపైగా ఈ కంపెనీలతో ఏపీ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది.

అయితే పెట్టుబడులపై ఓ అవగాహానకు రాకుండానే వివరాలను బయటకు వెళ్ళడించకూడదనే ఆయా కంపెనీలు షరతులుు విధించాయి.ఒకవేళ ఆ వివరాలు బయటకు తెలిస్తే తమ కంపెనీల షేర్ల విలువలు, ఇతర అంశాలపై ప్రబావం ఉండే అవకాశం ఉందని ఆయా కంపెనీలు ఎపీ ప్రభుత్వానికి వివరించినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి.

ఈ కారణంగానే ఆయా కంపెనీలతో సమావేశం వివరాలను రహాస్యంగా ఉంచాల్సి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.తొలుత ఢిల్లీ విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్ లోనే సమావేశం కావాలని భావించారు.

అయితే అక్కడ కూడ అనేకమంది ప్రముఖులు ఉంటారనే ఉద్దేశ్యంతో పక్కనే ఉన్న మరో భవనంలో సమావేశాన్ని నిర్వహించారు.దాదాపు 4 గంటలపాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చర్చలు జరిపారు. అనంతరం ఏపీ భవన్ కు వెళ్ళి తిరిగి విమానాశ్రయానికి చేరుకొన్నారు.జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న ముఖ్యమంత్రి ప్రతి కదలిక ప్రతి ఒక్కరికీ తెలిసే అవకాశాలుంటాయి. సిఎం వద్దన్నా కూడ సెక్యూరిటీ సిబ్బంది ఆయనకు భద్రతను కల్పించకతప్పని పరిస్థితులుంటాయని అధికారులు చెబుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhrapradesh chiefminister Chandrababu naidu met kuwait and airbus oil company delegates on Friday. Don't tell before agreement companies appel to Ap governament, so Babu met companies secretely.
Please Wait while comments are loading...