జెసిపై బాబు ఆగ్రహం: పార్టీని నాశనం చేస్తున్నారు, పిలిచి మాట్లాడుతా

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫైర్ అయ్యారు. కొందరు నేతలు వ్యవహరిస్తున్నతీరుతో పార్టీకి చెడ్డపేరు వస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. జెసి దివాకర్ రెడ్డిని పిలిపించి మాట్లాడుతానని బాబు చెప్పారు.

అనంతపురం జిల్లా పార్టీ నాయకులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం నాడు అమరావతిలో సమావేశమయ్యారు.

జిల్లాలో పార్టీ పరిస్థితిపై ఆయన చర్చించారు. పార్టీ నాయకుల మధ్య సమన్వయం , ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలబలాలు, ఇతర పార్టీల బలం తదితర అంశాలపై బాబు చర్చించారు.

రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్లను ఖర్చుచేసి అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టినా కొందరు నాయకులు చేస్తున్న పనులు పార్టీకి తీవ్రంగా నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయన్నారు.

jc diwakar reddy

విశాఖ విమానాశ్రయంలో అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి వ్యవహరించిన తీరును సమావేశంలో చంద్రబాబునాయుడు ప్రస్తావించారు. కొందరు నాయకులు వ్యవహరించిన తీరుతో పార్టీకి నష్టం వాటిల్లుతోందన్నారు.

జెసి వ్యవహరించిన తీరును బాబు తప్పుబట్టారు. ప్రజా ప్రతినిధులు ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. జెసి దివాకర్ రెడ్డిని పిలిపించి మాట్లాడుతానని బాబు చెప్పారు.

మరోవైపు అనంతపురం జిల్లా పరిషత్ ఛైర్మెన్ స్థానంలో చమన్ ను రాజీనామా చేయాలని బాబు సూచించారు. ఒప్పందం ప్రకారంగానే చమన్ తన పదవికి రాజీనామా చేయాలని సూచించారు. అయితే వచ్చే నెల 15న, తాను పదవికి రాజీనామా చేస్తానని చమన్ బాబుకు చెప్పారు.అనంతపురం జిల్లా పరిషత్ ఛైర్మెన్ పదవికి పోల నాగరాజు పేరును ప్రతిపాదించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ap chiefminister Chandrababu naidu serious on Anantapuram MP Jc Diwakar reddy.Anantapur district tdp leaders met Chandrababu naidu on Saturday at Amaravati.Babu disatisfy Jc Diwakar Reddy atittude in Vizag airport.
Please Wait while comments are loading...