గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గౌతు శిరీషకు మళ్లీ సీఐడీ నోటీసు- 20న రమ్మని ఆదేశం- విచారణ తీరుతో ప్రాధాన్యం

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ ప్రభుత్వ పథకాల్ని తీసేస్తున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యవహారంలో టీడీపీ మహిళా నేత గౌతు శిరీషకు సీఐడీ చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే ఓసారి మంగళగిరిలోని సీఐడీ కార్యాలయానికి విచారణకు రావాలని శ్రీకాకుళం జిల్లా పలాసలో ఉన్న శిరీషకు ఒక్కరోజు ముందు నోటీసులు పంపి రప్పించిన అధికారులు.. ఈసారి జూన్ 20 న విచారణకు రావాలని నోటీసులు పంపారు.

ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటలకు గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో హాజరుకావాలని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. ఐటీ చట్టం కింద నమోదు చేసిన కేసులో దర్యాప్తు కోసం హాజరుకావాలని తాఖీదులిచ్చారు. కాగా ఇప్పటికే గౌతు శిరీష మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో ఓసారి విచారణకు హాజరయ్యారు. నేరం అంగీకరిచాలంటూ సంతకాలు పెట్టమని సీఐడీ అధికారులు ఒత్తిడి చేయగా తాను తిరస్కరించినట్లు శిరీష తెలిపారు.

ap cid notices to gouthu sireesha again, asked to attend on june 20 in fake posts case

ఓ కాగితంపై వారికి నచ్చినట్లు రాసుకొచ్చి దానిపై సంతకం చేయాలంటూ ఒత్తిడి చేశారని ఆమె వెల్లడించారు. అందులో రాసిన అంశాలను తాను అంగీకరించడం లేదని సంతకం చేస్తానని చెప్పగా.. అలా అయితే ఇక్కడి నుంచి బయటికి పంపించేదే లేదంటూ హెచ్చరించారని పేర్కొన్నారు. అసలు ఏ కేసులో నాకు నోటీసులిచ్చారో దానికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ అడిగినా పట్టించుకోలేదని, 7 గంటల పాటు కనీసం మంచినీళ్లు, ఆహారమైనా ఇవ్వకుండా బంధించి విచారించారు" అని ఆమె పేర్కొన్నారు.

అమ్మఒడి, వాహనమిత్ర పథకాలను నిలిపేస్తున్నారని పేర్కొని ఉన్న నకిలీ ప్రెస్‌నోట్‌ను సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేశారంటూ గత నెల 29న సీఐడీ పలువురిపై కేసు నమోదుచేసింది. అందులో భాగంగా గౌతు శిరీషను కూడా నిందితురాలిగా పేర్కొని విచారణకు పిలిపించింది. మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో ఈనెల 6న ఉదయం 11 గంటలకు ఆమె విచారణకు హాజరయ్యారు. సాయంత్రం 6 గంటలకు బయటకు వచ్చారు.
అనంతరం విచారణ జరిగిన తీరును ఆమె వివరించారు.

తన సోషల్ మీడియా ఖాతాలకు సంబంధించిన పాస్‌వర్డ్‌లు అడిగారని, అవి గుర్తులేవనడంతో కొత్త పాస్‌వర్డ్‌లు సృష్టించి నాతోనే వాటిని ఓపెన్‌ చేయించారని శిరీష తెలిపారు. తమ న్యాయవాదిని, తనను వేర్వేరు గదుల్లో ఉంచారుృని, ఫోన్‌లు అందుబాటులో లేకుండా చేశారని పేర్కొన్నారు. ఉగ్రవాదులతో వ్యవహరించినట్లు ప్రవర్తించారని తెలిపారు. పోస్టును షేర్‌ చేయాలంటూ అందరితోనూ మీరే చెప్పారట కదా! మీతో ఆ పోస్టు ఎవరు పెట్టించారో చెప్పండి' అని ప్రశ్నించడంతో తాను అలాంటి పోస్టులేవి పెట్టలేదన్నానన్నారు. ఫేస్‌బుక్‌లో తమ ఫ్రెండ్స్‌ లిస్ట్‌లో ఉన్న వారు ఎవరో చెప్పాలని అడగగా... చెప్పాల్సిన అవసరం లేదన్నానని ఆమె వివరించారు. అరగంటకు ఒకసారి బయటకు వెళ్లిన అధికారులు వారి ఉన్నతాధికారులు చెప్పింది విని మళ్లీ నన్ను విచారించారన్నారు. అక్రమ కేసులో తనను ఇరికించాలని ప్రయత్నించారన్నారు.

English summary
tdp leader gouthu sireesha has been asked to attend ap cid inquiry again on june 20.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X