నారా లోకేష్ కు విచారణలో సీఐడీ ప్రశ్నలివే ? అమరావతి ఐఆర్ఆర్ కేసులో..
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకుందని చెబుతున్న అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. హైకోర్టు ఆదేశాల మేరకు నారా లోకేష్ కు 41ఎ నోటీసులు ఇచ్చి ఇవాళ విచారణకు రావాలని కోరడంతో ఆయన మంగళగిరికి వచ్చారు. కుంచనపల్లిలోని సీఐడీ కార్యాలయంలో జరుగుతున్న ఈ విచారణలో లోకేష్ కు అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డుపై పలు ప్రశ్నలు సంధించారు. వాటికి లోకేష్ కూడా అంతే స్ధాయిలో సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇవాళ్టి విచారణలో సీఐడీ పెదకాకాని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన రిజిస్ట్రేషన్ ల ఆధారంగా లోకేష్ ను ప్రశ్నిస్తోంది.ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు సమాచారం మీకు ముందే ఎలా తెలుసని ప్రశ్నించిన సీఐడీ.. మూడుసార్లు అలైన్మెంట్ మార్చడం వెనుక మీ పాత్ర ఉంది కదా అని ఆయన్ను అడిగింది. అలాగే హెరిటేజ్ సంస్థకు లబ్ది చేకూర్చేలా అలైన్మెంట్ ఎందుకు మార్చారని ప్రశ్నించింది.

హెరిటేజ్ సంస్థ ఆ ప్రాంతంలోనే ఎందుకు భూములు కొనుగోలు చేసిందని కూడా అధికారులు లోకేష్ ను అడిగారు. 2014జులై 30న జరిగిన హెరిటేజ్ బోర్డు సమావేశంలో భూముల కొనుగోలుపై తీర్మానం చేశారు కదా అని అడిగారు. లింగమనేని రమేష్ కి మీకు ఉన్న సంబంధం ఏంటని కూడా లోకేష్ ను అడిగినట్లు తెలుస్తోంది. మంగళగిరి, తాడేపల్లి,తుళ్లూరు పరిసరాల్లోనే భూములు ఎందుకు కొనుగోలు చేశారని కూడా లోకేష్ ను వారు ప్రశ్నించారు. చంద్రబాబు నుంచి రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు సమాచారం మీకు తెలిసిందా అని అడిగారు.












Click it and Unblock the Notifications