అమరావతిలో చంద్రబాబు నివాసం జప్తు - కీలక మలుపు..!!

టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లి నివాసం జప్తులో సీఐడీ మరో అడుగు ముందుకేసింది. అమరావతి మాస్టర్ ప్లాన్..ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్ మెంట్ మార్చటంలో అవినీతి వ్యవహారంలో చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటితో పాటుగా మాజీ మంత్రి నారాయణ..ఆయన సంబంధీకుల ఆస్తులపై సీఐడీ నివేదిక మేరకు అటాచ్ మెంట్ కు హోం శాఖ అనుమతి ఇచ్చింది. ఇప్పుడు ఇదే వ్యవహారంలో న్యాయ పరంగా అనుమతి పొందేందుకు సీఐడీ అభ్యర్ధన పై నేడు అవినీతి నిరోధక శాఖ కోర్టు విచారణ చేయనుంది.

సీబీఐ విచారణ :అమరావతి కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమరావతి నగర ప్రణాళిక..రింగ్ రోడ్డు వ్యవహారంలో అవినీతి చోటు చేసుకుందని ఫిర్యాదుల పైన సీఐడీ విచారణ చేసింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అనేక కోణాల్లో విచారణ చేపట్టింది. గత ఏడాది మే నెలలో కేసు నమోదు చేసింది. వ్యాపారవేత్త లింగమనేని రమేష్ కు అనుకూలంగా నాటి ప్రభుత్వం క్విడ్ ప్రో కో కు పాల్పడిందనే అభియోగాలు నమోదయ్యాయి. లింగమనేని రమేష్ కు మేలు చేసేందుకే రింగ్ రోడ్ అలైన్ మెంట్ లో మార్పులు జరిగాయాని నిర్ధారణకు వచ్చింది. లింగమనేని ఇంటిని అమ్మకుండా నిరోధించేందుకు క్రిమినల్‌ లా అమెండ్‌మెంట్‌ ఆర్డినెన్స్‌1944 కింద జప్తు చేసేందుకు, తదుపరి చర్యలు తీసుకునేందుకు సీఐడీ అనుమతి కోరింది.

AP CID Reaches ACB Court for orders to implement TDP Chandra Babu Geust house Attahcement in Amaravati

ప్రభుత్వ ఉత్తర్వులు:మాజీ సీఎం చంద్రబాబు, నారాయణ తో పాటుగా మరి కొందరు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసారని పేర్కొంది, తమ సొంత లాభం కోసం వాస్తవాలు దాచడం, వాస్తవాలను తప్పుగా చిత్రీకరించడం చేశారని సీఐడీ నివేదికలో వివరించింది. ఈ క్రమంలో చట్టాలు, ఉత్తర్వులు, సర్క్యులర్లు, కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) మార్గదర్శకాల ఉల్లంఘిన జరిగిందని వివరించింది. అధికారులు లేవనెత్తిన అభ్యంతరాలను పట్టించుకోకుండా నేరపూరితమైన కుట్రతో మార్పులకు ఆమోదముద్ర వేశారని పేర్కొంది. లింగమనేని, హెరిటేజ్‌, ఇతరుల భూములు రాజధాని సిటీ మాస్టర్‌ప్లాన్‌ కింద సేకరించకుండా, ఇన్నర్‌ రింగ్‌ వారి భూములకు మరింత సమీపం నుంచి వెళ్లేలా ప్లాన్‌లు ఆమోదింపజేసుకున్నారని ఆరోపించింది. లింగమనేని ఇంటిని అమ్మకుండా నిరోధించేందుకు క్రిమినల్‌ లా అమెండ్‌మెంట్‌ ఆర్డినెన్స్‌1944 కింద జప్తు చేసేందుకు, తదుపరి చర్యలు తీసుకునేందుకు సీఐడీ అనుమతి కోరింది.

కోర్టులో విచారణ:ఈ మేర కు హోంశాఖ ముఖ్యకార్యదర్శి సీఐడీకి అనుమతి ఇస్తూ జీవో జారీచేశారు. నారాయణ సంబంధీకుల ఆస్తులకు సంబంధించి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పుడు న్యాయ పరంగా ఆదేశాలు పొందేందుకు సీఐడీ అవినీతి నిరోధక శాఖ కోర్టులో సీఐడీ దరఖాస్తు చేసింది. మంగళవారం జరిగిన విచారణలో ప్రత్యేక పీపీ వివేకానంద వాదనలు వినిపించారు. ఎటాచ్ మెంట్ కు ముందు ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. చట్ట నిబంధనల పరిశీలన..తదుపరి వాదనలు వినేందుకు ఈ రోజు (బుధవారం) కు వాయిదా వేస్తూ న్యాయాధికారి నిర్ణయం తీసుకున్నారు. దీంతో, కోర్టులో ఈ రోజు జరిగే విచారణ కీలకం కానుంది. ఇప్పటికే ఈ వ్యవహారం రాజకీయంగా అనేక మలుపులు తీసుకుంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+