రఘురామ ఇంటి వద్ద హైడ్రామా :నోటీసులు జారీ -17 న విచారణ : గెలుస్తా- మెజార్టీయే కీలకం..!!
వైసీపీ రెబల్ ఎంపీకీ ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ నుంచి ఎంపీ రఘురామ హైదరాబాద్ చేరుకున్న విషయం తెలుసుకున్న సీఐడి అధికారులు ఈ ఉదయం హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉన్న రఘురామ నివాసం వద్దకు చేరుకున్నారు. సీఐడి అధికారులు వచ్చిన విషయం తెలిసిన వెంటనే రఘురామ న్యాయవాదులు అక్కడకు చేరుకున్నారు. సీఐడీ అధికారులతో చర్చలు చేసారు. తొలుత రేపు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

17న విచారణకు రావాలంటూ
ఈ రోజు నోటీసు ఇచ్చి..రేపు విచారణ అంటే ఎలా సాధ్యమని ప్రశ్నించారు. దీంతో..ఉన్నతాధికారులతో చర్చించిన తరువాత 17వ తేదీన విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసారు. ముందు సీబీఐ అధికారులు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ తరువాత రఘురామ కుమారుడు వచ్చి అధికారులతో చర్చించి.. ఒక అధికారి వచ్చి నోటీసులు ఇవ్వాలని సూచించారు. ఒక అధికారితో పాటుగా నోటీసులు జారీ వ్యవహారాన్ని వీడియో తీయాలంటూ మరో అధికారితో కలిసి ఇద్దరు కలిసి రఘురామ రాజుకు నోటీసులు అందించారు. 17న గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకు రావాలని అందులో సూచించారు.

రేపు నర్సాపురానికి రఘురామ
గతంలో జారీ చేసిన కేసులో విచారణకు ఆయన హాజరు కాలేదని.. ఆ కేసులోనే తిరిగి విచారణకు నిమిత్తం ఈ నోటీసులు జారీ చేసారు. గతంలో ఇదే కేసులో రఘురామను అరెస్ట్ చేసిన సమయంలో తనను హింసించారంటూ రఘరామ న్యాయస్థానంలో ఫిర్యాదు చేసారు. ఆ తరువాత సుప్రీంలో బెయిల్ మంజూరు అయింది.
అప్పటి నుంచి రఘురామ ఢిల్లీలో నే ఉంటున్నారు. డిసెంబర్ 17న అమరావతి రాజధానిగా కొనసాగించాలంటూ తిరుపతిలో జరిగిన సభకు ఆయన హాజరయ్యారు. ఇక, ఇప్పుడు రఘురామ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి రెండేళ్ల నుంచి విచారణకు హాజరు కాకుంటే చర్యలు ఉండవా అంటూ ప్రశ్నించారు.

గెలుపు ఖాయం - మెజార్టీయే కావాలి
పిబ్రవరి 5 తరువాత రాజీనామా చేస్తానని వెల్లడించారు. దాదాపు రెండేళ్ల తరువాత సంక్రాంతికి ఎంపీ రఘురామ తన సొంత నియోజకవర్గానికి రావాలని నిర్ణయించారు. తనకు నోటీసులు జారీ చేయటం పైన స్పందించిన రఘురామ తాను చట్టం పైన గౌరవంతో విచారణకు హాజరవుతానని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్.. సీఐడీ ఉన్నతాధికారి సంక్రాంతి ప్రత్యేకత తెలియదని.. పండుగ రోజుల్లో విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చారంటూ విమర్శించారు. తన పైన విమర్శలు చేసిన రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ పైన రఘురామ తీవ్ర వ్యాఖ్యలతో మండిపడ్డారు.
Recommended Video

పార్టీలు కలిసి రావాలి..మద్దతివ్వాలి
ఏపీలో లా అండ్ ఆర్డర్ ఉందా అని ప్రశ్నించారు. గత కేసుల పైన మరింత సమాచారం కోసం విచారణకు పిలుస్తున్నామంటూ సీఐడి అధికారులు చెప్పినట్లు రఘురామ వివరించారు. ఇక, నర్సాపురం ఎంపీగా తాను రాజీనామా చేసిన తరువాత అక్కడ తన గెలుపు ఖాయమని..అయితే, మెజార్టీయే ముఖ్యమని రఘురామ చెప్పుకొచ్చారు. అన్ని పార్టీలు - ప్రజలు కలిసి రావాలని రావణ పాలనకు వ్యతిరేకంగా తనను గెలిపించాలని కోరారు. దీంతో.. నర్సాపురం లో రఘురామ పర్యట పైన ఇప్పుడు రాజకీయంగా ఉత్సుకత నెలకొని ఉంది. కొద్ది రోజుల్లో అక్కడ నుంచే తిరిగి పోటీ చేయాలని నిర్ణయించటంతో రఘురామకు సైతం ఈ పర్యటన కీలకంగా మారుతోంది.












Click it and Unblock the Notifications