చంద్రబాబు ఢిల్లీ పర్యటన....సోమవారం కేంద్ర మంత్రులతో భేటీ

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం రాత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. సోమవారం ఆయన కేంద్రమంత్రులు నితిన్‌ గడ్కరీ, అరుణ్‌జైట్లీతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో చంద్రబాబు ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నట్లు తెలిసింది.

Ap CM chandra babu Delhi Tour

పోలవరంపై అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పోలవరం పై కేంద్రం లేఖ నేపథ్యంలో మిత్రపక్షమైన బిజెపి పై ఒక రోజు విమర్శలు మరో రోజు సంయమనం ఇలా టర్న్ ల మీద టర్న్ లు తీసుకుంటున్న చంద్రబాబు ఈసారి ఢిల్లీ పర్యటనతో మిత్ర పక్షం పై ఒక స్పష్టతకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
amaravathi: andhra pradesh chief Minister chandrababu naidu is set to tour delhi. CM will be meeting various Union Ministers about the polavaram project.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి