చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సినీ నటులనూ లాగుతున్నారు: చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: మీడియాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ఆర్టీసి సమ్మెపై కూడా స్పందించారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై కేబినెట్‌ సబ్‌కమిటీ వేశామని చంద్రబాబు చెప్పారు.

తాను అధికారంలోకి రాగానే రూ.250 కోట్లతో ఆర్టీసీని ఆదుకున్నానని, కాని కార్మికులు 43 శాతం ఫిట్‌మెంట్‌కు పట్టుబట్టడం సరికాదన్నారు. కొన్ని పత్రికలు, చానళ్లు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆయన ఆరోపించారు.

AP CM Chandrababu blames media

ఎర్రచందనం స్మగ్లర్లు ఎంతటివారైనా వదిలేది లేదన్నారు. సినిమా నటులను కూడా స్మగ్లింగ్‌ ఉచ్చులోకి లాగుతున్నారని ఆయన ఆరోపించారు. కాల్వ గట్లపై తాను నిద్రిస్తున్నానంటే సీరియస్‌నెస్‌ను కాంట్రాక్టర్లు అర్థం చేసుకోవాలన్నారు. హంద్రీనీవా పనులను సకాలంలో పూర్తిచేయాలని చంద్రబాబు కోరారు.

కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గం పరిధిలోని వీరపునాయని పల్లె మండలంలో ఉన్న సర్వరాయప్రాజెక్టు పనులను సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు అధికారులతో సీఎం మాట్లాడారు. వచ్చే సీజన్‌కల్లా ఈ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు నీరందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

English summary
Andhra Pradesh CM Nara Chandrababu Naidu blamed a section of media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X