ఇరిగేషన్‌ భూముల్లో సౌర విద్యుత్‌ ప్లాంట్లు.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి శాఖ పరిధిలో ఉన్న వనరులను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇరిగేషన్‌ శాఖ పరిధిలోని భూముల్లో సౌర విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. బుధవారం అమరావతిలో సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎత్తిపోతల పథకాల మరమ్మతులు, నిర్వహణపై వివరంగా చర్చించారు. ఈ ప్రాజెక్టులను జలధార కార్పొరేషన్‌ ద్వారా పర్యవేక్షించాలని సీఎం సూచించారు. విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ తరహాలో వాటర్‌ రెగ్యులేటరీ కమిషన్‌ను ఏర్పాటు చేసే అవకాశాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం గుర్తించిన 36 ప్రాధాన్యతా ప్రాజెక్టులను రెండున్నరేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించారు.

AP CM Chandrababu Directs Solar Power Plants on Irrigation Lands Reviews Lift Irrigation Projects

ఎత్తిపోతల పథకాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించి వచ్చే జూన్‌ నాటికి వాటి ద్వారా నీరు విడుదల చేసేలా కార్యాచరణ చేపట్టాలని కూడా స్పష్టం చేశారు.సమావేశంలో అధికారులు సమర్పించిన వివరాల ప్రకారం జలవనరుల శాఖ పరిధిలో అందుబాటులో ఉన్న 5,565 ఎకరాల భూమిలో 4,061 ఎకరాలను సౌర విద్యుత్‌ ప్లాంట్లకు గుర్తించారు. వీటి ద్వారా సుమారు 877.3 మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు.

ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో కూడా సౌర ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవచ్చని వివరించారు.రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు విద్యుత్‌ ఖర్చు ఎక్కువగా ఉంటోంది. సౌర విద్యుత్‌ ద్వారా ఈ భారం తగ్గించి, అదనపు ఆదాయం సమకూర్చుకోవచ్చని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్రం పునరుత్పాదక ఇంధన రంగంలో వేగంగా ముందుకు వెళ్ళేలా సీఎం చంద్రబాబు చొరవ తీసుకుంటున్నారు .

తెలంగాణలో సగం మెడికల్‌ షాప్స్ లో నో ఫార్మసిస్ట్స్.. టీజీ సేఫ్‌ నోటీసులు జారీ!
తెలంగాణలో సగం మెడికల్‌ షాప్స్ లో నో ఫార్మసిస్ట్స్.. టీజీ సేఫ్‌ నోటీసులు జారీ!

పెద్ద ఎత్తున సోలార్‌ పార్కులు, తయారీ యూనిట్లు, వ్యవసాయ పంప్‌సెట్ల సోలరైజేషన్‌ వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇరిగేషన్‌ భూముల్లో సౌర ప్లాంట్లు ఏర్పాటు చేయడం వల్ల భూమి సమర్థవంతంగా వినియోగపడటమే కాకుండా, విద్యుత్‌ ఉత్పత్తితో రాష్ట్ర అవసరాలు తీరుతాయని అధికారులు భావిస్తున్నారు.మంత్రి నిమ్మల రామానాయుడు, జలవనరుల శాఖ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. సీఎం సూచనల మేరకు త్వరగా చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+