ఆ స్కాంపై అస్సలు మాట్లాడొద్దు ?..మంత్రులకు చంద్రబాబు కీలక ఆదేశం..!
ఏపీలో ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం మంత్రులతో కలిసి సీఎం చంద్రబాబు నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం మంత్రులతో మాట్లాడిన చంద్రబాబు ఓ అంశంపై కీలక సూచనలు చేశారు.
ఈ విషయంలో తాను గీసిన గీత దాటొద్దంటూ మంత్రులకు ఆయన సూచించారు. దీంతో చంద్రబాబు మంత్రులకు ఇచ్చిన సూచన చర్చనీయాంశంగా మారింది.
గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంపై ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో ప్రస్తావన వచ్చింది. ఈ స్కాంపై జరుగుతున్న దర్యాప్తు, ఇతర అంశాలపై మంత్రులతో చంద్రబాబు మాట్లాడారు. అనంతరం వారికి ఓ కీలక సూచన చేశారు. రాష్ట్రంలో మద్యం కుంభకోణం దర్యాప్తుపై మంత్రులు ఎవరూ మాట్లాడొద్దంటూ చంద్రబాబు సూచించారు. ఈ వ్యవహారంపై అనవసరంగా మాట్లాడితే మరో రకంగా వెళ్తుందని చంద్రబాబు వారికి తెలిపారు.

లిక్కర్ స్కాంపై ప్రభుత్వం నియమించీిన సిట్ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తోందని చంద్రబాబు మంత్రులకు తెలిపారు. కాబట్టి వాళ్ళ పని వాళ్ళని చూసుకోనివ్వాలన్నారు. మద్యం కుంభకోణంపై అనవసర వ్యాఖ్యలు చేస్తే ప్రజల్లోకి మరో రకంగా వెళ్లే ప్రమాదం ఉందని చంద్రబాబు తెలిపారు. కాబట్టి దర్యాప్తు సంస్థలకు వారి పని వారు చేసేలా ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని తెలిపారు. ఈ స్కాంపై పత్రికల్లో వచ్చిన వార్తలపై బహిరంగంగా స్పందించవద్దని మంత్రులకు చంద్రబాబు సూచించారు.
మరోవైపు ఇతర అంశాలపైనా మంత్రులకు చంద్రబాబు సూచనలు చేశారు. వచ్చే కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా సాధించిన విజయాలు, ప్రజలు మనోభావాలపై చర్చిద్దామన్నారు. వైజాగ్ డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదాపై ఇన్ ఛార్జ్ మంత్రి స్వామిని సీఎం ప్రశ్నించారు. రేషన్ సరఫరాకు వాహనాలను కేబినెట్ రద్దు చేసిన నేపథ్యంలో వీటిపై తీసుకున్న రుణాలను ప్రభుత్వం చెల్లించి వాహనాల యజమానులకు ఇచ్చేయాలని నిర్ణయించారు. రేషన్ స్థానంలో నగదు ఇస్తే ఎలా ఉంటుంది అనే అంశంపై కూడా కేబినెట్‌లో చర్చకు వచ్చినా నిర్ణయం తీసుకోలేదు.












Click it and Unblock the Notifications