నిన్నటిదాకా దూరం!: గవర్నర్ వద్దకు బాబు, బిజెపితో గ్రేటర్ ప్లాన్ (పిక్చర్స్)
హైదరాబాద్: ఓటుకు నోటు, ట్యాపింగ్ వివాదాల మధ్య గవర్నర్ నరసింహన్‌కు దూరమైన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం గవర్నర్‌ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రలో నిర్వహిస్తున్న గోదావరి పుష్కరాలకు కుటుంబ సమేతంగా రావాలంటూ గవర్నర్ నరసింహన్‌ను చంద్రబాబు ఆహ్వానించారు. పుష్కర ఆహ్వానం అందించేందుకు జరిగిన భేటీ చాలాసేపు జరిగిందని టీడీపీ వర్గాలు తెలిపాయి.
గోదావరి పుష్కరాల సందర్భంగా జాతీయ స్థాయి నేతలు, సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను రాజమండ్రికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించారు. ఇదిలా ఉండగా, చంద్రబాబు రంజాన్ తోఫా ప్రారంభించారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ చంద్రబాబును కలిశారు.

చంద్రబాబు - నరసింహన్
ఇదిలావుంటే, ఇటీవలి కాలంలో చంద్రబాబుకు, గవర్నర్‌కు మధ్య దూరం పెరిగిన విషయం తెలిసిందే. ఓటుకు నోటు కుంభకోణం వెలుగుచూడటం, ఇందులో చంద్రబాబు ప్రమేయం ఉందన్న ఆరోపణలు తలెత్తాయి.

చంద్రబాబు - నరసింహన్
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో శాంతి భద్రతలు గవర్నర్‌కు అప్పగించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్‌లో కొంతమంది మంత్రులు, టీడీపీ నేతలు గవర్నర్ నరసింహన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

చంద్రబాబు - నరసింహన్
గవర్నర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, గవర్నర్‌ను తొలగించాలనే డిమాండ్లు కూడా తెదేపా చేసింది. సెక్షన్ 8ను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్, రాష్టప్రతిని, కేంద్రాన్ని కలిసి వినతిపత్రాలు సైతం ఇచ్చింది. ఆ తర్వాత టిడిపి కాస్త దూకుడు తగ్గించింది.

చంద్రన్న రంజాన్ తోఫా
రాష్ట్ర ప్రభుత్వం ముస్లీంలకు అందిస్తున్న రంజాన్ తోఫా ప్రతి లబ్ధిదారుడికీ కచ్చితంగా చేరేలా చూడాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

చంద్రన్న రంజాన్ తోఫా
ఆదివారం చంద్రబాబు నాయుడు తన నివాసంలో చంద్రన్న రంజాన్ తోఫా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు - దత్తాత్రేయ
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తే గ్రేటర్ హైదరాబాద్ పీఠం తప్పకుండా మనదేనని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయతో చంద్రబాబు చెప్పారు.

చంద్రబాబు - దత్తాత్రేయ
ఆదివారం నాడు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. వారి మధ్య గ్రేటర్ ఎన్నికల అంశం చర్చకు వచ్చింది.

చంద్రబాబు - దత్తాత్రేయ
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తే గ్రేటర్ హైదరాబాద్ పీఠం తప్పకుండా మనదేనని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయతో చంద్రబాబు చెప్పారు.












Click it and Unblock the Notifications