ఎట్టకేలకు ఏడాది తర్వాత ఖరారు: అపాయింటుమెంట్, రేపు మోడీతో బాబు భేటీ

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోడీ అపాయింటుమెంట్ ఇచ్చారు. శుక్రవారం (12-0-2018) ఉదయం గం.10-40 నిమిషాలకు ప్రధానితో సీఎం భేటీ కానున్నారు.

ఏడాదిన్నర తర్వాత 17న ప్రధానితో చంద్రబాబు భేటీ!: ఎంపీలకు మోడీ హామీ

దాదాపు ఏడాది తర్వాత వీరిద్దరు భేటీ అవుతున్నారు. ప్రధానమంత్రి అపాయింటుమెంట్‌పై పీఎంవో అధికారులు సీఎం చంద్రబాబుకు సమాచారం అందించారు. దీంతో చంద్రబాబు గురువారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరనున్నారు.

AP CM Chandrababu Naidu to meet PM Modi tomorrow

కాగా, ఇటీవల ఏపీకి చెందిన ఎంపీలు, కేంద్రమంత్రులు ప్రధాని మోడీని కలిసిన విషయం తెలిసిందే. విభజన సమస్యలతో పాటు చంద్రబాబు అపాయింటుమెంట్ గురించి చర్చించారు. దీంతో భేటీకి మార్గం సుగమం అయింది.

మోడీకి మెలిక: బాబుకు కలిసొచ్చిన ట్రిపుల్ తలాఖ్ బిల్లు

ప్రధానితో భేటీలో ఏపీ విభజన సమస్యలను చంద్రబాబు చర్చించే అవకాశముంది. విభజన హామీలు, ప్రత్యేక ప్యాకేజీ తదితర అంశాలతో పాటు ట్రిపుల్ తలాక్ అంశం కూడా చర్చించనున్నారని తెలుస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu to meet Prmie Minister Narendra Modi tomorrow.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి