జపాన్ బుల్లెట్ రైలులో ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్: జపాన్ పర్యటలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుల్లెట్ రైలులో ప్రయాణించారు. ఆయన తన బృందంతో జపాన్ రాజధాని టోక్యో నుంచి ఫుకువోకా వెళ్లారు. చంద్రబాబుతో పాటు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ఎంపీ గల్లా జయదేవ్ తదితరులు బుల్లెట్ రైలులో ప్రయాణాన్ని ఆస్వాదించారు.
తొలుత చంద్రబాబు ఇండియా ఐటీ ఫోరంతో సమావేశం అయ్యారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాల్పిందిగా విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల అవకాశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఏపీలోని వనరులు, రవాణా సౌకర్యాల గురించి ఐటీ ఫోరం ప్రతినిధులకు చంద్రబాబు వివరించారు.

తర్వాత చంద్రబాబు ఎలక్ట్రానిక్ దిగ్గజం ప్యానాసోనిక్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. భారత దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడిందన్నారు. వరి, వాణిజ్య పంటల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులు, నదీ జలాలు, ఖనిజాలు, మానవ వనరుల గురించి ఆయన వివరణ ఇచ్చారు.
ఏపీలో 24 గంటలూ విద్యుత్ ఉంటుందని, కృష్ణ పట్నం పోర్టును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని, ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేశారు. సాంకేతిక రంగంలో జపాన్ ముందంజలో ఉందని, జపాన్ అభివృద్ధి ప్రపంచానికేస్ఫూర్తిదాయకమని అన్నారు.












Click it and Unblock the Notifications