హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు!
హైదరాబాదును మించేలా అమరావతిని అభివృద్ధి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచం గుర్తించేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అమరావతిని స్మార్ట్ సిటీ గా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
గచ్చిబౌలిలో సౌత్ ఏషియా లెర్నింగ్ సమ్మిట్లో పాల్గొన్న చంద్రబాబు
గచ్చిబౌలిలోని ఐ ఎస్ బి లో జరిగిన సౌత్ ఏషియా లెర్నింగ్ సమ్మిట్లో పాల్గొన్న చంద్రబాబు కృత్రిమ మేధ విస్తరణ లక్ష్యాల పైన ప్రసంగించారు. 1990ల తర్వాత ఇంటర్నెట్ ప్రారంభమైందని, 1995 నుండి నుండి నాలెడ్జ్ ఎకానమీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. హైదరాబాద్లో ఐటీ కంపెనీలను పెట్టడం కోసం ఢిల్లీ వెళ్లి బిల్ గేట్స్ ని కలిసినట్టుగా చంద్రబాబు పేర్కొన్నారు.

హైదరాబాద్ నగరానికి ఐటీ సంస్థలు, బడా విద్యాసంస్థలు తెచ్చా
హైదరాబాద్ లో కార్యాలయం పెట్టాలని తాను కోరగా, మొదట బిల్ గేట్స్ నిరాకరించారని, తాను చేసిన కృషి ఫలితంగా తర్వాత కాలంలో అది సాధ్యమైందన్నారు. ఐ ఎస్ బి, నల్సార్, ట్రిపుల్ ఐటి వంటి విద్యాసంస్థలను హైదరాబాద్ నగరానికి తీసుకురావడంలో తాను సక్సెస్ అయ్యాను అన్నారు. శంషాబాద్ విమానాశ్రయం కోసం 5000 ఎకరాల సేకరించామని తెలిపారు. కేవలం 9 నెలల్లోనే కృష్ణానది తాగునీరు అందించినట్టు పేర్కొన్నారు.
1999 నుండి 2004 మధ్య హైదరాబాద్ నగరాభివృద్ధికి చంద్రబాబు కృషి
హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందడంలో తాను ఎంతో కృషి చేశానని, 1999 నుండి 2004 మధ్య హైదరాబాద్ నగరాభివృద్ధికి దోహదం చేశానన్నారు. జీనోమ్ వ్యాలీ ఏర్పాటులో తన కృషి ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. అనేక కారణాలతో 2004లో అధికారం కోల్పోయి, ఆ తర్వాత మళ్లీ పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చామన్నారు. ఇక 2014 నుండి 2019 వరకు ఏపీలో అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు చంద్రబాబు.
ఇప్పుడు ఏపీ అన్ని రంగాల్లో అగ్ర స్థానంలో
కేవలం అభివృద్ధి పైన మాత్రమే దృష్టి పెడితే ఎన్నికలలో గెలవలేము అనే గుణపాఠం 2019లో నేర్చుకున్నామన్నారు. 2019 నుండి 2024 మధ్య ఏపీ అభివృద్ధి కుంటుపడిందని చంద్రబాబు విమర్శించారు. 2024లో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసి పనిచేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం అనేక రంగాలలో అగ్రస్థానంలో ఉందని, ఏపీని అన్ని విధాలుగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సుసంపన్నం చేస్తామని అన్నారు.
గ్రీన్ ఎనర్జీరంగంలో ''దక్షిణాదిలో మేమే నెంబర్‌వన్''
ఏఐ, డేటా సెంటర్లు, క్వాంటమ్, అంతరిక్ష సాంకేతికతలు, డ్రోన్లు, ఎయిర్ అంబులెన్స్‌లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరగా విస్తరిస్తున్నాయని వివరించారు. విద్యుత్ సమస్యలను అధిగమించి, మిగులు స్థాయికి తీసుకొచ్చామని, గ్రీన్ ఎనర్జీరంగంలో ''దక్షిణాదిలో మేమే నెంబర్‌వన్'' అని చంద్రబాబు స్పష్టం చేశారు. అన్ని విధాలుగా ఏపీని తీర్చిదిద్ది హైదరాబాద్ ను మించి అమరావతిని అభివృద్ధి చేస్తామన్నారు.
-
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
ఏపీలో మహిళలకు దక్కే నియోజకవర్గాలు లిస్టు ఇదే, కీలక మంత్రుల స్థానాలు సైతం..!! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications