పవన్ కళ్యాణ్‌తో రేపు చంద్రబాబు భేటీ: రాజధానికి ఆగని భూసేకరణ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నష్టనివారణ చర్యలకు నడుం బిగించారు. చంద్రబాబునాయుడు రేపు (ఆదివారం) జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో భేటీ కానున్నారు.
భూసేకరణ తదితర అంశాలను చంద్రబాబు పవన్‌కల్యాణ్‌కు వివరించే అవకాశం ఉంది. శనివారం సాయంత్రం రాత్రి విజయవాడ నుంచి చంద్రబాబు హైదరాబాద్‌కు రానున్నారు. శనివారం ఉదయం చంద్రబాబు పార్టీ నాయకులతో విజయవాడలో సమావేశం ఏర్పాటు చేశారు. ఇరు రాష్ట్రాల కమిటీల ఏర్పాటు కోసమే కాకుండా భాసేకరణ, కార్యాలయాల తరలింపు తదితర అంశాలపై ఆయన సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
రైతులు సహకరించాలి...

కాగా, ఎపి రాజధాని నిర్మాణం కోసం చేపట్టిన భూసేకరణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేదు. రాజధాని నిర్మాణం కోసం భూసమీకరణకు రైతులు సహకరించాలని మంత్రి నారాయణ విజ్ఝప్తి చేశారు. భూసమీకరణకు రైతులంగా సహకరిస్తే 2019కి మంచి రాజధానిని నిర్మించుకుంటామన్నారు. రాజధాని వల్ల పరిసర ప్రాంతాల వారి ఆర్థికస్థితి పెరుగుతుందని తెలిపారు. భూసమీకరణ ఈ విషయంలో విపక్షాలు రాద్దాంతం చేయడం మానుకోవాలని సూచించారు.
నోటీసులు జారీ చేస్తాం..
రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వని వారికి నోటీసులు జారీ చేస్తామని మరో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. రాజధాని నిర్మాణానికి రైతులు సహకరించాలని కోరారు. ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు రూ.65కోట్లు అవసరమని మంత్రి చెప్పారు.

రెండు రాష్ర్టాల్లో పార్టీ కమిటీల ఏర్పాటు, అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు టీడీపీ సమావేశం ఏర్పాటు చేశామని మంత్రి ప్రత్తిపాటి వివరించారు. వైసీపీకి పట్టున్న గ్రామాల్లో భూములు ఇవ్వకుండా వైఎస్ జగన్ రైతులను రెచ్చగొడుతున్నారని ఎమ్మెల్సీ ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు.
గ్రామ కంఠాల ఖరారుకు నోటిఫికేషన్
రాజధాని గ్రామాల్లో గ్రామకంఠాలను ఖరారు చేసి భూసేకరణకు నోటిఫికేషన్‌ను జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాజధానిలో భూసేకరణ నోటిఫికేషన్‌ను విడుదల చేయలేదు. కొరగల్లు, నవులూరు-1, నవులూరు-2, కృష్ణాయపాలెంలలో భూసమీకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు.
న్యాయసలహా మేరకు నోటిఫికేషన్‌కు ముందు అన్ని రకాల ప్రక్రియలను పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. సీఎంతో జరిగిన సమావేశంలో ఉన్నతాధికారుల సూచనల ప్రకారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
-
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications