వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాపు కార్పోరేష‌న్ ఛైర్మ‌న్‌గా యువ‌నేత : జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం: నాడు తండ్రి..నేడు త‌న‌యుడు..!

|
Google Oneindia TeluguNews

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఉభ‌య గోదావ‌రి జిల్లాలో వ‌చ్చిన సీట్లు..ఓట్ల‌ను దృష్టిలో పెట్టుకొని భ‌విష్య‌త్‌లోనూ నిల‌బెట్టుకొనేలా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఈ రెండు జిల్లాలకు ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టిన సీఎం జ‌గ‌న్.. ఒక్కో జిల్లాకు మూడు మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. ఇక‌, కాపులకు అండ‌గా నిలుస్తాన‌ని ఇచ్చిన హామీ మేర‌కు తాజా బ‌డ్జెట్‌లో కాపు సంక్షేమం కోసం రెండు వేల కోట్లు కేటాయించారు. ఇదే స‌మ‌యంలో కీల‌క మైన కాపు కార్పోరేష‌న్ ఛైర్మ‌న్ ప‌ద‌విని ఖ‌రారు చేసారు. తూర్పు గోదావ‌రి జిల్లాకు చెందిన యువ‌నేత‌..త‌న అనుచ‌రుడి గా ఉన్న నేత‌కే ఈ ప‌ద‌వి క‌ట్ట‌బెడుతూ ఆమోద ముద్ర వేసారు.

తొలి నుండి వైయ‌స్‌కు అండ‌గా..
కాపు కార్పోరేష‌న్ ఛైర్మ‌న్‌గా వైసీపీ యువ‌జ‌న నేత‌గా ఉన్న జ‌క్కంపూడి రాజాను నియ‌మిస్తూ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నిర్ణ యం తీసుకున్నారు. తూర్పు గోదావ‌రి జిల్లా రాజాన‌గ‌రం ఎమ్మెల్యేగా ఉన్న రాజా దివంగ‌త నేత జ‌క్కంపూడి రామ్మోహ న రావు త‌న‌యుడు. జ‌క్కంపూడి రామ్మోహ‌న‌రావు తొలి నుండి కాంగ్రెస్‌లో వైయ‌స్ వ‌ర్గంలో ఆయ‌న‌కు అత్యంత స‌న్ని హితుడిగా ఉండేవారు. 2004లో అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత జ‌క్కంపూడికి త‌న కేబినెనెట్‌లో వైయ‌స్ కీల‌క‌మైన ఎక్సైజ్ అండ్ ప్రొహిబిష‌న్ శాఖ‌ను అప్ప‌గించారు. కొద్ది కాలానికి రామ్మోహ‌న‌రావు అనారోగ్యం కార‌ణంగా బ‌య‌ట‌కు రాలేని ప‌రిస్థితుల్లో ఉన్నా..ఆయ‌న‌ను మంత్రిగా కొన‌సాగించారు. ఇక‌, వైయ‌స్..జ‌క్కంపూడి రామ్మోహ‌న రావు మ‌ర‌ణం త‌రువాత ఆయ‌న కుటుంబం జ‌గ‌న్‌కు మ‌ద్దతుగా నిలిచింది. 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ నుండి పోటీ చేసిన జ‌క్కంపూడి స‌తీమ‌ణి ఓడిపోయారు. ఇక‌, జ‌గ‌న్ ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో యువ‌జ‌న నేత‌గా వారి కుమారుడు రాజా యువ భేరీ కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క పాత్ర పోషించారు. ప్ర‌త్యేక హోదా మ‌ద్దుగా ఈ స‌భ‌లు నిర్వ‌హించారు.

AP Cm jagan appointed Jakkaampudi Raja as Kapu corporation Chairman. He representing Raja nagaram constituency

కాపు కార్పోరేన్ చైర్మ‌న్‌గా..
ఇక‌, తాజా ఎన్నిక‌ల్లో జ‌క్కంపూడి రాజాకు తూర్పుగోదావ‌రిలోని రాజాన‌గ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుండి జ‌గ‌న్ టిక్కెట్ ఖ‌రా రు చేసారు. ఎన్నిక‌ల్లు గెలిచిన రాజాకు ఇప్పుడు కీల‌కమైన కాపు కార్పోరేష‌న్ ఛైర్మ‌న్ ప‌ద‌విని ఖ‌రారు చేసారు. కాపుల విష‌యంలో త‌న మాట నిల‌బెట్టే బాధ్య‌త‌ను రాజా మీద పెట్టారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీ మేర‌కు జ‌గ‌న్ తాజా బ‌డ్జెట్‌లో కాపు సంక్షేమానికి రెండు వేల కోట్లు కేటాయించారు. ఇప్పుడు ఆ నిధులు కాపు సంక్షేమానికి ఖ‌ర్చు చేసి వారి మ‌న్న‌న‌లు ప్ర‌భుత్వానికి అందించే బాధ్య‌త‌ను రాజాకు అప్ప‌గించారు. టీడీపీ హాయంలో ఎన్నిక‌ల ముందు కాపు కార్పోరేష‌న్ ఛైర్మ‌న్‌గా ప‌ని చేసిన కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడు సైతం ప్ర‌స్తుతం వైసీపీలోనే ఉన్నారు. ఇక‌, నాడు త‌న తండ్రి వైయ‌స్సార్‌...జ‌క్కంపూడి రామ్మోహ‌న‌రావుకు ప్రాధాన్య‌త ఇస్తే..ఇప్పుడు త‌న‌కు మ‌ద్ద‌తుగా తొలి నుండి నిలిచిన ఆయ‌న త‌న‌యుడు రాజాకు జ‌గ‌న్ ప్రాధాన్య‌త ఇస్తున్నారు. మ‌రి..రాజా త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాన్ని ఏ ర‌కంగా స‌ద్విని యోగం చేసుకుంటారు.. ఏ విధంగా స‌క్సెస్ అవుతార‌నేది చూడాలి.

English summary
AP Cm jagan appointed Jakkaampudi Raja as Kapu corporation Chairman. He representing Raja nagaram constituency in East Godavari dist.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X