విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉద్యోగులను రెచ్చగొట్టింది ఎర్రజెండాలు-పచ్చజెండాలే : చంద్ర‌బాబుపై సీఎం జ‌గ‌న్ ఫైర్‌

|
Google Oneindia TeluguNews

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకుంటున్న చంద్రబాబు ..లెప్ట్‌పార్టీలకు మిత్రుడని విమర్శించారు. ఉద్యోగులను ఎర్రజెండాలు, పచ్చ జెండాలు కలిసి రెచ్చగొట్టేవిధంగా వ్వవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా మాత్రమే సమ్మె కావాలని కోరుకుంటున్నారని దుయ్యబట్టారు. ఉద్యోగులు సమ్మెకు విరమించగానే క్రామేడ్లను చంద్రబాబు ముందుకు తోచారని ఆరోపణలు గుప్పించారు. ఉపాధ్యాయులను రెచ్చ‌గొట్టే విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు.

ఎర్రజెండా వెనుక పచ్చజెండా

ఎర్రజెండా వెనుక పచ్చజెండా

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు వెళ్లాలని ప్రభుత్వం, ప్రజలు ,ఉద్యోగులు ఎవరూ కోరుకోవడం లేదని సీఎం జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు సీఎం కాలేదన్న బాధ, కడుపు మంట ఉన్న వారే సమ్మె కోరుకుంటున్నారని మండిపడ్డారు. ఉద్యోగుల సమ్మె జరుగుతుందంటే ఎల్లో మీడియాకు పండగ అని దుయ్యబట్టారు. ఎర్రజెండా వెనుక పచ్చజెండా ఉందన్నారు. ముఖ్యమంత్రిని తిడితే ఇంకా బాగా కవరేజ్‌ ఇస్తారు. ఉద్యోగులను ఎర్రజెండాలు-పచ్చజెండాలు కలిసే రెచ్చగొట్టారని జగన్ ఆరోపణలు గుప్పించారు.

కామ్రేడ్లకు చంద్ర‌బాబు ఆత్మీయుడు

కామ్రేడ్లకు చంద్ర‌బాబు ఆత్మీయుడు

ఇవాళ జగనన్న చేదోడు రెండో ఏడాది నగదు విడుదల కార్యక్రమంలో సీఎం జగన్‌ మాట్లాడారు. పేదల ఇళ్లను అడ్డుకున్న వ్యక్తి కామ్రేడ్లకు ఆత్మీయుడైయ్యారని జగన్ విమర్శించారు. ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్న వ్యక్తి... రామోజీరావుకు ముద్దుబిడ్డగా ఉన్నారన్నారు. బీసీల తోకలు కత్తిరిస్తా అన్న వ్యక్తి రాధాకృష్ణకు ఆత్మీయుడయ్యారు. బీసీలు జడ్జీలుగా పనికి రారని కేంద్రానికి లేఖ రాసిన వ్యక్తి చంద్రబాబు అని జగన్ విరుచుకుపడ్డారు. కరోనా సమయంలో కష్టాలు ఎదుర్కొంటూ.. త‌మ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు మంచి చేస్తుందన్నారు . కానీ ఎర్రజెండాలు, పచ్చజెండాలు కలిసి తమ ప్రభుత్వంపై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తూ.. ఉద్యోగుల‌ను రెచ్చ‌గొడుతున్నార‌ని జగన్ విరుచుకుప‌డ్డారు.

Recommended Video

AP PRC: 27 శాతానికి ఫిట్ మెంట్ ఇచ్చినట్టేనా AP CM Jagan క్లారిటీ | Andhra Pradesh | Oneindia Telugu
ఉద్యోగులు ఆందోళనలు.. ఎల్లో మీడియాకు పండగ

ఉద్యోగులు ఆందోళనలు.. ఎల్లో మీడియాకు పండగ

పచ్చ జెండా ముసుగులో ఉన్న ఎర్రజెండా వారిని చంద్రబాబు ముందుకు తోశారని జగన్ ఫైర్ అయ్యారు. ఆశా వర్కర్లు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ వారి ఆందోళనలకు కమ్యునిస్టులు మద్దతిస్తున్నారని మండిపడ్డారు. కరోనా కష్ట కాలంలో కూడా ప్రజా సంక్షేమాన్ని అందిస్తున్న మెరుగైన తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జెండాలు పట్టుకుని ఆందోళనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు ఆందోళన చేస్తామంటే చాలు ఎల్లో మీడియాకు పండగ అంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబు బినామీలు, రియల్ ఎస్టేట్ వారి కోసం కమ్యూనిస్టులు ఎర్ర జెండాలు పట్టుకున్నారని జ‌గ‌న్ ఆరోపించారు. అమరావతిలో పేదలకు ఇళ్లు ఇచ్చేందుకు భూములు కేటాయిస్తే అడ్దుకున్నారని మండిపడ్డారు..

English summary
CM YS Jagan Mohan reddy fire on chandrababu and communists over Employees Strike
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X