ముఖ్యమంత్రి జగన్ విదేశీ టూర్ : ఇజ్రాయెల్..అమెరికా షెడ్యూల్ ఖరారు: డల్లాస్‌లో ఓపెన్ సభ..!
ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి సీఎం హోదాలో జగన్ విదేశీ పర్యటనకు వెళ్లను న్నారు. జూన్ 30న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తరువాత వరుసగా రెండు విడతలుగా అసెంబ్లీ సమా వేశాలు జరగటంతో ఆయన ముందుగానే విదేశాలకు వెళ్లాలని భావించినా సమయం అనుకూలించలేదు. సీఎం జగన్ కుటుంబ సభ్యులతో కలిసి అగస్టులో రెండు దేశాల్లో పర్యటించనున్నారు. ఈ రెండు పర్యటనలు పూర్తిగా వ్యక్తిగత పర్యటనలుగా సీఎంఓ ఖరారు చేసింది. అందులో భాగంగా ఇజ్రాయెల్..అమెరికా పర్యటనలు ఖరారయ్యాయి. సీఎంఓ ఇచ్చిన సమాచారం మేరకు సీఎం విదేశీ పర్యటన షెడ్యూల్ ఏంటంటే..
కుటుంబ సభ్యులతో కలిసి ఇజ్రాయెల్...
ఈనెల 30వ తేదీ వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఆ తరువాత ఆగస్టు 1వ తేదీ నుండి ముఖ్యమంత్రి జగన్ కుటుంబ సభ్యులతో కలిసి ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లనున్నారు. ప్రతీ ఏడాది వేసవిలో వైయస్ కుటుంబం ఇజ్రాయెల్ లోని జెరూసెలం వెళ్లటం ఆనవాయితీగా వస్తోంది. వైయస్సార్ సైతం ఇదే విధంగా కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లేవారు. అయితే, రాజకీయంగా బిజీ గా ఉండటం..పాదయాత్ర కారణంగా ఇది గత మూడేళ్లుగా సాధ్య పడలేదు. దీంతో..ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత ఈ పర్యటనకు వెళ్లాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఆగస్టు 1వ తేదీ రాత్రి ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్తున్నారు. 4వ తేదీ అక్కడ నుండి తిరిగి బయలు దేరి 5వ తేదీ విజయ వాడకు చేరుకుంటారు. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమైనదని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. ఇదే విధం గా దీని తరువాత అమెరికా పర్యటనకు ముఖ్యమంత్రి వెళ్లనున్నారు.

ఆగస్టు 16 నుండి అమెరికా పర్యటన..
ముఖ్యమంత్రి జగన్ తన ప్రభుత్వంలో తొలి సారి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను విశాఖలో నిర్వహించాలని ఇప్ప టికే నిర్ణయించారు. ఆ వెంటనే ఆగస్టు 16న కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఆగస్టు 16 వ తేదీ నుండి 22వ తేదీ వరకు అమెరికా పర్యటన జరగనుంది. ఇది కూడా పూర్తిగా ముఖ్యమంత్రి వ్యక్తిగత పర్యటనగా అధికారులు స్పష్టం చేసారు. అయితే..అమెరికాలోని ప్రవాసాంధ్రులు..వైసీపీ ఎన్నారై విభాగం విజ్ఞప్తి మేరకు అక్కడ జరిగే సమావేశంలో మాత్రం జగన్ పాల్గొంటారు. ఈ మేరకు ఆగస్టు 17వ తేదీన డల్లాస్ నగరంలో తెలుగు వారిని ఉద్దేశిం చి జగన్ ప్రసంగిస్తారు. ఇప్పటికే దీని కోసం డల్లాస్ కన్వెన్షన్ సెంటర్ ముఖ్యమంత్రి సభ కోసం ఏర్పాటు చేసారు. అమె రికా సంయుక్త రాష్ట్ర తెలుగు వారందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. ఆగష్టు 17న మధ్యాహ్నం 2 గంటల నుండి 7 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఆ తరువాత వైసీపీ ఎన్నారై విభాగం ఏర్పాటు చేసిన కార్యక్ర మాల్లోనూ ముఖ్యమంత్రి హాజరు కానున్నారు.












Click it and Unblock the Notifications