విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ భరోసాతో చిరు టీమ్ దిల్ ఖుష్.. విశాఖపై కీలక నిర్ణయం.. ఏం మాట్లాడారంటే..

|
Google Oneindia TeluguNews

''ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలవాలని సినీ ఇండస్ట్రీ పెద్దలందరం ఏడాదికాలంగా అనుకుంటున్నాం. కానీ రకరకాల కారణాల వల్ల అది కుదరలేదు. మొత్తానికి ఇవాళ కలవగలిగాం. అన్నింటికన్నా ముందుగా అందరి తరఫున సీఎంకు ధన్యవాదాలు చెబుతన్నా..''అంటూ మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఆయన నేతృత్వంలోని సినీ పెద్దల బృందం మంగవారం తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్ తో భేటీ అయింది. అనంతరం సమావేశం వివరాలను చిరంజీవే స్వయంగా మీడియాకు వెల్లడించారు.

చైనా ఆక్రమణ.. తప్పుచేశామన్న అమిత్ షా.. ప్రతిపక్షాలపై నిప్పులు.. ఆ 60 కి.మీ భారత్ వదులుకుందా?చైనా ఆక్రమణ.. తప్పుచేశామన్న అమిత్ షా.. ప్రతిపక్షాలపై నిప్పులు.. ఆ 60 కి.మీ భారత్ వదులుకుందా?

నెల ఆలస్యంగా?

నెల ఆలస్యంగా?

లాక్ డౌన్ కారణంగా దాదాపు మూడు నెలలుగా సినిమా, సీరియల్స్ షూటింగ్స్ నిలిచిపోయిన నేపథ్యంలో వాటిని మళ్లీ కొనసాగించేందుకు అనుమతులు కోరుతూ చిరంజీవి నేతృత్వంలోని బృందం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవగా.. జూన్ 15 నుంచి షూటింగ్స్ చేసుకోవచ్చని చెప్పారు. అయితే ఏపీలో మాత్రం జులై 15 నుంచి అనుమతులిస్తామని మంత్రి పేర్ని నాని చెప్పడం గమనార్హం.

మంత్రి నానితో..

మంత్రి నానితో..

ఏపీలో సినిమా, టీవీ సీరియర్స్ షూటింగ్స్ అనుమతులకు సంబంధించి మార్గదర్శకాలపై మంత్రి పేర్ని నానితో సమన్వయం చేసుకోవాల్సిందిగా చిరు బృందానికి సీఎం జగన్ సూచించారు. సమావేశం తర్వత సినీ పెద్దలతో కలిసి మంత్రి నాని సైతం మీడియాతో మాట్లాడారు. సీఎం సూచనల మేరకు జులై 15 తర్వాత సినిమా షూటింగ్‌లు జరుపుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. దీనికి సంబంధించిన ఆదేశాలు త్వరలోనే జారీ చేస్తామని, సినీ పరిశ్రమకు అన్ని విధాలుగా తోడుంటామని అన్నారు. షూటింగ్స్ అనుమతులతో పాటు ఇంకొన్ని కీలకమైన అంశాలను కూడా సీఎం వద్ద ప్రస్తావించినట్లు చిరంజీవి తెలిపారు.

విశాఖపై కీలక నిర్ణయం..

విశాఖపై కీలక నిర్ణయం..

సినిమా షూటింగ్స్ పున: ప్రారంభించేందుకు విధి విధానాలతోపాటు సినిమా థియేటర్లలో మినిమం ఫిక్స్‌డ్‌ఛార్జీలు ఎత్తివేసే అంశంపైనా.. టికెట్స్ ధరలపై ఫ్లెక్సీ రేట్ల అంశంపైనా పరిశీలిస్తానని సీఎం చెప్పినట్లు చిరంజీవి వివరించారు. ఏపీ కొత్త రాజధానిగా భావిస్తోన్న విశాఖపట్నంపైనా సినీ పెద్దల మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్.. సినీ పరిశ్రమ కోసం విశాఖలో కేటాయించిన 300 ఎకరాల్లో కార్యకలాపాలు ప్రారంభిస్తామని, వివాఖలో సినీ పరిశ్రమ మరింతగా విస్తరించేలా స్టూడియోల నిర్మాణాలు చేపట్టేందుకు కట్టుబడి ఉన్నామని చిరంజీవి తెలిపారు. అంతలోనే మంత్రి నాని అందుకుంటూ.. విశాఖపట్నంలో సెటిల్‌ అవ్వాలనుకునే సినిమా వ్యక్తులకు ఇళ్ల స్థలాలు కూడా కేటాయిస్తామన్నారు.

కేంద్రం సిగ్నల్ ఇచ్చాకే..

కేంద్రం సిగ్నల్ ఇచ్చాకే..


సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్స్ అంశంపై సానుకూలంగా స్పందించిన ఏపీ సర్కారు.. థియేటర్లను తెరిచే విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నది. సినీ పెద్దలతో కలిసి మీడియాతో మాట్లాడిన మంత్రి పేర్ని నాని.. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే థియేటర్లు తెరుస్తామని స్పష్టం చేశారు. అలాగే, సీఎ ఆదేశాల మేరకు 2019-20 నంది అవార్డులకు విధివిధానాలు రూపొందిస్తామన్నారు. మొత్తంగా ఏపీ సీఎంతో భేటీ ఫలప్రదమైందని, అన్ని వినతులపై సానుకూలత వ్యక్తమైందని చిరంజీవి ప్రకటించారు.

బాలయ్య డుమ్మా.. చిరుకు సెగ..

ఏపీ సీఎంతో చర్చలకు వెళ్లిన సినీ పెద్దలకు అమరావతి రైతుల నుంచి నిరసన సెగ ఎదురైంది. చిరంజీవి నాయకత్వంలో నాగార్జున, సురేశ్, దిల్ రాజు, రాజమౌళి, విజయ్ చందర్, త్రివిక్రమ్, సీ.కల్యాణ్ తదితరులు.. గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా ఉండవల్లిలోని గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్‌కు చేరుకున్న సమయంలో.. కొందరు మహిళలు ఆందోళనకు దిగారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ప్లకార్డులతో ప్రదర్శన చేశారు. ఉద్రిక్తతలు ఏర్పడకుండా పోలీసులు ముందస్తుగానే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, ఏపీ సీఎంను కలిసేందుకు వెళ్లే బృందంలోకి టీడీపీ ఎమ్మెల్యే బాలయ్యను సైతం ఆహ్వానించినా, ఆయన డుమ్మా కొట్టారు.

English summary
A delegation of Telugu Film Industry led by chiranjeevi met with cm jagan on tuesday. while addressing media after the meeting, chiranjeevi told that govt has agreed for movie shootings. new film studios will be developed in visakhapatnam, he added
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X