• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపీలో కరోనా: సీఎం జగన్ సంచలనం.. లాక్‌డౌన్ ఎత్తేస్తామని ప్రకటన.. వైరస్ మనలో భాగమేనంటూ..

|

లాక్ డౌన్ అమల్లోకి వచ్చి నెలరోజులు పూర్తయిన తర్వాత కూడా కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కంట్రోల్ లోకి రాకపోవడం, స్థంభించిన ఆర్థిక వ్యవస్థను రీస్టార్ట్ చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎగ్జిట్ స్ట్రాటజీపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. ఆ సమావేశం ముగిసిన కొద్దిసేపటకే ఏపీ సీఎం వైస్ జగన్ మీడియాతో మాట్లాడారు. మే 3 తర్వాత ఏపీలోని గ్రీన్ జోన్లలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేస్తామని, తిరిగి జనజీవనం యధావిధిగా కొనసాగేలా చూస్తామని సంచలన ప్రకటన చేశారు.

  Lockdown Lifting In AP || కరోనా వైరస్ వ్యాప్తిని ఎప్పటికీ కంట్రోల్ చెయ్యలేం : సీఎం జగన్

  అంతేకాదు, కరోనా వైరస్ వ్యాప్తిని ఎప్పటికీ కంట్రోల్ చేయలేమని, రాబోయే రోజుల్లో కరోనా.. ఇతర వైరస్ ల మాదిరిగా మానవ జీవితంలో భాగమైపోతుందని జగన్ అన్నారు. గడిచిన నెల రోజుల వ్యవధిలో హెల్త్ కేర్ రంగాన్ని బలోపేతం చేసుకున్నామని, తద్వారా లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. లాక్ డౌన్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోన్నవేళ ఏపీ సీఎం ఒక్కరే బహిరంగ ప్రకటన చేయడం దేశవ్యాప్త చర్చకు దారితీసింది. జగన్ ఏం చెప్పారంటే...

  నెవర్ ఎండింగ్ ప్రక్రియ..

  నెవర్ ఎండింగ్ ప్రక్రియ..

  ‘‘ఈ సందర్బంలో ప్రజలకు కొన్ని విషయాలు చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. ఇన్ని చర్యలు తీసుకున్న తర్వాత కూడా మనం కరోనాను కట్టడి చేయలేమన్న వాస్తవాన్ని అందరూ గ్రహించాలి. వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేమన్నదే రియాలిటి. ఇన్ని చేసిన తర్వాత కూడా ఒకరో ఇద్దరో మిగిలి, వాళ్లు తుమ్మడమో, దగ్గడమో చేస్తే మళ్లీ వైరస్ వ్యాప్తిస్తుంది. అదొక నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఎందుకీ విషయాలు చెబుతున్నానంటే.. రాబోయే రోజుల్లో మనమంతా కరోనాతో కలిసి జీవించాల్సిన పరిస్థితి ఉంటుదని గ్రహించాలి.

  కరోనాకు ఫిక్స్ అయిపోండి..

  కరోనాకు ఫిక్స్ అయిపోండి..

  ఈ కరోనా లేదా కొవిడ్ అనేది భయంకరమైన వ్యాధి అనో, అదేదో అంటరానితనమనో భావించొద్దు. అలాంటి ఆలోచనలేవైనా ఉంటే దయచేసి బుర్రల్లోంచి తీసేయండి. రాబోయే రోజుల్లో వైరస్ అందరికీ అంటుకునే ఆస్కారముంది. ఎందుకంటే ఆ వైరస్ మన జీవితంలో ఒక అంతర్భాగం అయిపోతుంది. ఇంతకుముందు స్వైన్ ఫ్లూ మరికొన్ని వైరస్ ల విషయంలోనూ ఇలాగే జరిగింది. ఆ వైరస్ పుట్టి, మనతోనే కంటిన్యూ అవుతోందని గుర్తుచేసుకోవాలి. వీటితోపాటు కరోనా వైరస్ కూడా ప్రాణాంతకమైనదేమీకాదు, అది సోకినప్పుడు జాగ్రత్త వహించి, చికిత్స తీసుకుంటే బయటపడొచ్చు. అసలు రోగ లక్షణాలు లేకుండానే వైరస్ బారినపడుతోన్నవాళ్లు 80 శాతంగా ఉన్నట్లు లెక్కలున్నాయి. ప్రధానంగా ఇంట్లో పెద్దవాళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి. కరోనా సోకినవాళ్లలో చనిపోతున్నవాళ్లు కేవలం 2 శాతంలోపే ఉన్నారు.

  లాక్ డౌన్ ఎత్తివేత..

  లాక్ డౌన్ ఎత్తివేత..

  గ్రీన్ జోన్ లో జనజీవనం యధావిధిగా సాగాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు చర్యలు తీసుకుంటాం. అయితే ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సోషల్ డిస్టెన్స్ ను తప్పకుండా పాటించాలి. మాస్కుల్ని తప్పనిసరిగా వాడాలి. మనిషికి మూడు మాస్కులు అందజేస్తాం. వీటితోపాటు బలవర్ధకమైన ఆహారం తీసుకుంటే గ్రీన్ జోన్లను కాపాడుకోవచ్చు. ప్రభుత్వ రవాణా వ్యవస్థ పున:ప్రారంభానికి కొంత సమయం పట్టొచ్చు, అయితే ప్రైవేటు వాహనాలకు మాత్రం వెసులుబాటు కల్పిస్తాం. ఈ గ్రీన్ జోన్స్ లోని అన్ని పరిశ్రమలు తిరిగి పని చేస్తాయి. వ్యవసాయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొత్తంగా గ్రీన్ జోన్లలో జనజీవనం మళ్లీ యధావిధిగా కొనసాగుతుంది. రెడ్, ఆరెంజ్ జోన్లలో మాత్రం ఇంకొంతకాలం నిషేధాలు కొనసాగుతాయి. కరోనాకు మందు కనిపెట్టేంత వరకు ఇమ్యూనిటీ పెంచుకోవడం ఒక్కటే ఉత్తమ మార్గం.

  అంతా సిద్ధం చేసి ఉంచాం..

  అంతా సిద్ధం చేసి ఉంచాం..

  మార్చి 25 నుంచి లాక్ డౌన్ కొనసాగుతోంది. గడిచిన నెల రోజుల్లో చాలా అడుగులు వేశాం. టెస్టింగ్ సామర్థ్యాన్ని బాగా పెంచుకోగలిగాం. ఇలాంటి విపత్తులేవైనా ఇంతకుముందు వచ్చుంటే, కనీసం ఎదుర్కొనే పరిస్థితి కూడా లేకుండేది. అలాంటి స్థితి నుంచి ఇవాళ 9 వీఆర్ డీఎల్ ల్యాబ్స్, 49 ట్రూనాట్ ల్యాబ్స్ ఏర్పాటు చేసుకోగలిగాం. ఒక్క రోజులోనే ఆరు వేలపైచిలుకు టెస్టులు నిర్వహించే స్థాయికి చేరుకున్నాం, దేశంలోనే ఎక్కువ టెస్టులు జరుగుతోన్న రాష్ట్రం ఏపీనే. దేశవ్యాప్తంగా సరాసరి ప్రతి 10 లక్షల మందిలో 541 మందికి కరోనా టెస్టులు చేస్తుండగా, ఏపీలో మాత్రం ఆ సంఖ్య 1396గా ఉంది. సోమవారం నాటికి 74,551 మందికి టెస్టులు నిర్వహించాం.

  80 శాతం గ్రీన్ జోన్..

  80 శాతం గ్రీన్ జోన్..

  కరోనా వ్యాప్తి, కేసుల నమోదు, దాని కట్టడికి సంబంధించి ప్రభుత్వం పూర్తి క్లారిటీతో ఉంది. 4 కంటే ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్ జోన్లుగా, 1 నుంచి 4 కేసులున్న ఏరియాలను ఆరెంజ్ జోన్లుగా, అసలు కేసులే లేని ప్రాంతాలను గ్రీన్ జోన్లుగా గుర్తిస్తున్నాం. ఆ లెక్కన చూస్తే రాష్ట్రంలోని మొత్తం 676 మండలాల్లో.. 63 మాత్రమే రెడ్ జోన్లో, 54 మండలాలు ఆరెంజ్ జోన్లో, మిగిలిన 559 మండలాలు గ్రీన్ జోన్ లో కొనసాగుతున్నాయి. అంటే 80 శాతం ఏపీలో కేసులు లేవు.

  సవాళ్లకు రెడీగా ఉన్నాం..

  సవాళ్లకు రెడీగా ఉన్నాం..

  గడిచిన నెలరోజుల్లో రాష్ట్ర ఆరోగ్య రంగాన్ని మునుపటికంటే బలంగా తయారు చేసుకోగలిగాం. ఐదు చోట్ల (విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కర్నూలులో) కొవిడ్ క్రిటికల్ కేర్ ఆస్పత్రుల్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇవి కాకుండా ప్రతి జిల్లాలో ఒక పెద్దాసుపత్రిని కేవలం కొవిడ్ రోగుల కోసమే సిద్ధం చేసి ఉంచాం. క్వారంటైన్ ఫెసిలిటీల్లోనూ దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీలో సౌకర్యవంతమైన ఏర్పాట్లు, పౌష్టికాహారాన్ని అందిస్తూ బాగా చూసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 40వేల క్వారంటైన్ బెడ్స్ ఉండగా, వాటిలో 25 బెడ్స్ సింగిల్ రూమ్స్ గా ఉన్నాయి, 15 వేల బెడ్స్ డబుల్ రూమ్స్ లో ఉన్నాయి. ఇవేకాకుండా, ప్రతి ఆస్పత్రిలో పీపీఈ కిట్స్, ఎన్-95 మాస్కులు, ఇతర సామాగ్రి కొరతలేకుండా చేయగలిగాం. అనుకోని ఇబ్బందులు తలెత్తే అవకాశాలను అంచనా వేసి, ఆ మేరకు జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, టీచింగ్ ఆస్పత్రుల్లోనూ ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసి ఉంచాం. అంతేకాదు, కరోనా ఆస్పత్రుల కోసమే ప్రత్యేకంగా డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్లను రిక్రూట్ చేసుకున్నాం. మిగిలిన ఆస్పత్రుల్లోనూ ఖాళీలను భర్తీ చేసేందుకు మే 15న నోటిఫికేషన్ ఇస్తాం. 104, 14410,హెల్ప్ లైన్ వ్యవస్థను కూడా మరింత బలోపేతం చేశాం. వాటి ద్వారా కరోనా, నాన్ కరోనా కేసుల్ని కూడా డీల్ చేస్తున్నాం.

  వాళ్లకు హ్యాట్సాప్..

  వాళ్లకు హ్యాట్సాప్..

  గ్రామస్థాయిలో వాలంటీర్లు, ఆశావర్కర్లు బాగా పనిచేస్తున్నందు వల్లే ఇప్పటికి మూడు సార్లు రాష్ట్ర వ్యాప్త సర్వేలు చేయగలిగాం. ఈ విషయంలో వాళ్లకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. వ్యవస్థను గొప్పగా తీర్చిదిద్దుకుంటూనే, లాక్ డౌన్ వల్ల సామాన్యుడి నష్టాలను పూడ్చడానికి శాయశక్తులా ప్రయత్నించాం. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా, పేదలను ఆదుకునే విషయంలో కాంప్రమైజ్ కాలేదు. ఈ నెల రోజుల కాలంలో పెన్షన్లు ఇతర వెల్ఫేర్ పథకాలు అన్నింటినీ నిరాటంకంగా ముందుకు తీసుకెళ్లాం.

  దయచేసి అలా వద్దు..

  దయచేసి అలా వద్దు..

  కరోనా వైరస్ సోకడమనేది అవమానకరమైన విషయమో లేదా అంటరానితనంగానో భావించొద్దు. ఇది ఎవరికైనా రావొచ్చు.. రేపు నాకైనా వైరస్ సోకొచ్చు. అది కేవలం జ్వరం లాంటిదేనని బాగా గుర్తుంచుకోండి. రోగ లక్షణాలు కనిపించిన వెంటనే 104కు ఫోన్ చేస్తే చాలు. మిగతా బాధ్యతంతా ప్రభుత్వమే చూసుకుంటుంది. ఎక్కవ శాతం కేసులు ఇంట్లో నుంచే నయం చేసుకోవచ్చు. పెద్దవాళ్ల పట్ల మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. దయచేసి దీన్నొక స్టిగ్మాగా, వివక్షగా చూడొద్దని ప్రజలను వేడుకుంటున్నాను. ఇప్పటిదాకా చనిపోయినవాళ్లలో ఎక్కువ మంది పెద్దవయసుండి, ఇతర వ్యాధులు ఉన్నవాళే తప్ప సాధారణ వ్యక్తులెవరికీ కరోనా వల్ల అపాయం ఉండదు.

  ఏపీనే టాప్..

  ఏపీనే టాప్..

  కరోనా వైరస్ ను అరికట్టలేముకానీ, దాని వ్యాప్తిని చాలా వరకు తగ్గించొచ్చు. అందుకోసం మన జీవనవిధానాల్లో చిన్న మార్పులు అవసరం. రోగనిరోధక శక్తి పెంపొందేలా పౌష్టికాహారాన్ని తీసుకోవడం అందులో ప్రధానమైనది. ఏపీలో 75వేల టెస్టులకుగానూ 1.61 శాతం మాత్రమే పాజిటివిటీ వచ్చింది. దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు 4 శాతంగా ఉంది. డబ్లింగ్ రేటులోనూ దేశం(9.1 రోజులు) కంటే ఏపీ(9.8 రోజులు) మెరుగ్గా ఉంది. మరణాల రేటు ఏపీలో 2.83 శాతంకాగా, దేశవ్యాప్తంగా అది 3.13 శాతంగా ఉంది’’అని సీఎం జగన్ వివరించారు.

  English summary
  andhra pradesh chief minister ys jagan told that lockdown will be eased in green zones across the state. after conference with pm modi, he said that coronavirus will continue as a part of human life like other viruses
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X