మోదీ జమిలి ప్రతిపాదన - సీఎం జగన్ అంగీకారం, ఏపీలో ముందస్తు..!?

ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో సీఎం జగన్ గంటకు పైగా జరిపిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్రంలో మారుతున్న సమీకరణాలతో లోక్ సభకు ముందస్తు ఎన్నికలకు మోదీ ప్రభుత్వం సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రధాని- ఏపీ ముఖ్యమంత్రి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. డిసెంబర్ లో ఎన్నికలు జరిగే అయిదు రాష్ట్రాలతో పాటుగా లోక్ సభ.. ఏపీఅసెంబ్లీకి ఎన్నికలు జరగటం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రధానితో చర్చల వేళ: ప్రధానితో జరిగిన ముఖ్యమంత్రి భేటీలో కీలక అంశాలపైన చర్చలు జరిగాయి. సంచలన నిర్ణయాల పై నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. జ‌మిలీనే ప్ర‌త్యేక అజెండాగా ఇద్దరు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో తెలంగాణ‌, రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, చ‌త్తీస్‌ఘ‌డ్‌, మిజోరంల‌కు ఎన్నిక‌లు జరగనున్నాయి.

AP CM Jagan pitches for early polls in a meet with PM Modi,reveals sources

వీటితో పాటుగా వచ్చే ఏడాది ఏప్రిల్ ఎన్నికలు జరగాల్సిన ఏపీ, ఒరిస్సా, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌, సిక్కింల‌ను క‌లుపుకునే యోచ‌న‌ పైన కేంద్రం చర్చలు ప్రారంభించింది. జ‌మిలీకే బిజేపీ అధిష్టానం మొగ్గుచూపుతోంది. ఈ అంశం పైన ప్రధాని-సీఎం జగన్ మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. మొత్తంగా తొమ్మది రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ఆలోచన జరుగుతోంది.

జమిలి ఎన్నికలకు రంగం సిద్దం: దీనికి సంబంధించి తమతో సఖ్యతగా ఉన్న రాష్ట్రాలతో కేంద్రం సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌తో ప్రధాని మోదీ..అమిత్ షా చర్చల్లో ప్రతిపాదించినట్లుగా విశ్వసనీయ సమాచారం. డిసెంబర్ లోనే లోక్ సభకు ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని కొద్ది రోజుల క్రితం బీహార్ సీఎం నితీశ్ వ్యాఖ్యానించారు.

ఎన్సీపీ నేతలు ఓపెన్ గానే ఈ విషయాన్ని చెబుతున్నారు. ప్రధాని మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన సమయం నుంచి జమిలి ఎన్నిలక నిర్వహణ పైన చర్చలు చేసారు. ఇప్పుడు బీజేపీ వ్యతిరేక కూటమి దేశ వ్యాప్తంగా ఏకం అవుతున్న సమయంలో వారికి ఛాన్స్ ఇవ్వకుండా బీజేపీ కేంద్ర నాయకత్వం వేగంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే పార్టీలో...ప్రభుత్వంలో మార్పులు మోదలు పెట్టింది.

ఏపీలో ముందస్తు ఎన్నికలు..?: ప్రధాని మోదీ దేశ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రారంభోత్సవాలు..శంకుస్థాపనలకు సిద్దమయ్యారు. దీనికి సంబంధించి ఈ రోజు ప్రధానితో సమావేశమైన సమయంలో ఏపీ సీఎం జగన్ తో చర్చలు చేసినట్లు సమాచారం. కేంద్రం నుంచి వచ్చిన ప్రతిపాదనకు సీఎం జగన్ తాము ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్దమేనని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.

ఏ నిర్ణయాలను అయినా సడన్ గా ప్రకటించిటం తొలి నుంచి మోదీ అనుసరిస్తున్న విధానం. పాకిస్థాన్ మూక‌ల‌పై స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ చేసిన‌ట్లు, నోట్లు ర‌ద్దు చేసిన‌ట్లు గానే విపక్షాలు పూర్తిగా మేల్కోకముందే ముందస్తు ఎన్నికల దిశగా ప్రకటనకు రంగం సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ముందస్తు ఎన్నికలు కలిసి వస్తాయని సీఎం జగన్ ధీమాతో ఉన్నారు. అందులో భాగంగానే అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+