వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కరోనా: సీఎం జగన్ యూటర్న్.. మోదీతో భేటీలో కుండబద్దలు.. రియాలిటీ గ్రహించారా?

|
Google Oneindia TeluguNews

దేశంలో ఎక్కడా లేని విధంగా కరోనా వైరస్‌పైనా పెద్ద ఎత్తున రాజకీయాలు చోటుచేసుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. వైరస్ ఉధృతిని తక్కువ చేసి చూపించారని, కేసులు, మరణాల లెక్కల్లోనూ దాపరికం ప్రదర్శించారని, అసలు రాష్ట్రంలో వైరస్ ప్రభావం లేదన్నట్లుగా కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారని ప్రతిపక్ష పార్టీలు అధికార వైసీపీపై దుమ్మెత్తిపోశాయి. రాజధాని తరలింపు, స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో సీఎం జగన్ వ్యవహరించిన తీరు కూడా అందుకు తక్కువేమీకాదు. ఒక దశలో ఎన్నికల తేదీలపైనా చర్చ చోటుచేసుకోవడం, లాక్ డౌన్ ఎత్తేసిన మరుక్షణమే పోలింగ్ ఉంటుందనే ప్రచారం జరగడంతో విమర్శలకు మరింత అవకాశమిచ్చినట్లయింది. అయితే..

Recommended Video

AP CM Jagan Asks For lockdown Extension in Conference With PM Modi
మోదీకి జగన్ రిపోర్ట్..

మోదీకి జగన్ రిపోర్ట్..

లాక్ డౌన్ మొదలైన తర్వాత కూడా ఒకింత ప్రశాంతంగానే కనిపించిన ఏపీలో.. గడిచిన రెండు వారాల నుంచి పరిస్థితి దారుణంగా తయారైంది. కొవిడ్-19 కేసుల సంఖ్య ఊహించని రీతిలో పెరిగింది. మరణాల సంఖ్య కూడా అమాంతం పైకెళ్లింది. ప్రధానంగా మూడు జిల్లాల్లో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. నిజానికి దేశంలో అతి ఎక్కువగా ర్యాపిడ్ టెస్టింగ్స్ చేపడుతున్న రాష్ట్రం ఏపీ కావడం వల్లే కేసుల సంఖ్యలో పెరుగుదల చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా నియంత్రణతోపాటు ఉపాధి కోల్పోయిన పేదల్ని ఆదుకునేందుకు తీసుకుంటున్న చర్యల్ని సీఎం జగన్.. మోదీకి వివరించారు. పీఎంతో సీఎంల కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన అనూహ్య ప్రతిపాదన చేసినట్లు తెలిసింది.

పొడగింపునకే మొగ్గు..

పొడగింపునకే మొగ్గు..

కరోనా వైరస్ పట్ల ప్రజల్లో భయాందోళనల్ని దూరం చేసేందుకు.. ‘‘అది జ్వరం లాంటిదే.. పెద్దగా భయపడాల్సిన పనిలేదు, ఒంటికి పారసిటమాల్, పరిసరాలకు బ్లీచింగ్ పౌడర్ వాడితే చాలు''అని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిదే. వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఏపీలో లాక్ డౌన్ సడలింపులు కావాల్సిందేనన్న వాదనను జగన్, ఆయన పార్టీ నేతలు చేస్తూవచ్చారు. అయితే సోమవారం నాటికి కేసుల ఉధృతి మరింత పెరగడం, ఇప్పుడప్పుడే వైరస్ వ్యాప్తి కంట్రోల్ లోకి వచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో జగన్ స్ట్రాటజీ మార్చుకున్నట్లు తెలిసింది. గతానికి భిన్నంగా, లాక్ డౌన్ పొడగించాల్సిందేనని ఏపీ సీఎం.. ప్రధానిని కోరినట్లు సమాచారం.

వాస్తవం గ్రహించారంటూ..

వాస్తవం గ్రహించారంటూ..

ఏపీలో లాక్ డౌన్ పొడగింపునకే సీఎం జగన్ మొగ్గుచూపారన్న వార్తలతో ప్రతిపక్ష శిబిరాలు ఒక్కసారే యాక్టివ్ అయ్యాయి. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ లేఖ వ్యవహారంలో ఇరుకునపడ్డ టీడీపీ.. వైసీపీపై మళ్లీ దాడి మొదలుపెట్టింది. కరోనా విషయంలో ముందునుంచీ తాము చెబుతున్నదే నిజమైందని, సీఎం జగన్ ఇప్పటికిగానీ వాస్తవాన్ని గ్రహించలేకపోయారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇక..

ఏపీలో సీన్ ఇది..

ఏపీలో సీన్ ఇది..

రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తోన్న కరోనా.. గత నాలుగు రోజులుగా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఏరోజూ 80 కేసులకు తక్కువ కాకుండా నమోదవుతున్నాయి. సోమవారంనాటి ఆరోగ్య శాఖ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 80 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1177 కు పెరిగింది. అందులో డిశ్చార్జ్ అయి 235మందికాగా, చనిపోయినవారి సంఖ్య 31కి పెరిగింది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 292 పాజిటివ్ కేసులు, గుంటూరు జిల్లాలో 237 కేసులు, కృష్ణాలో 210 కేసులు నమోదయ్యాయి. చాలాకాలం కరోనా ఫ్రీ జిల్లాగా ఉన్న శ్రీకాకుళంలో ఆదివారం మూడు కేసులు వచ్చాయి. దీంతో విజయనగరం ఒక్కటే ప్రస్తుతానికి కరోనా ఫ్రీ జిల్లాగా కొనసాగుతోంది.

జిల్లాల వారీగా..

జిల్లాల వారీగా..

కర్నూలు జిల్లా -292
గుంటూరు జిల్లా - 237
కృష్ణా జిల్లా - 210
నెల్లూరు జిల్లా -79
చిత్తూరు జిల్లా - 73
కడప జిల్లా -58
ప్రకాశం జిల్లా - 56
పశ్చిమ గోదావరి జిల్లా - 54
అనంతపురం జిల్లా -53
తూర్పుగోదావరి జిల్లా - 39
విశాఖపట్నం జిల్లా -22
శ్రీకాకుళం జిల్లా - 4
మొత్తం కేసులు -1177

English summary
Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy, who interacted with Prime Minister Narendra Modi through video conferencing over Covid-19 situation, reportedly asked the PM to keep such a restriction for few more days in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X