వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus: జాతీయ రహదారులు, రైళ్లు పునరుద్ధరించండి, ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ

|
Google Oneindia TeluguNews

లాక్ డౌన్ వల్ల తలెత్తిన పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. వివిధ రంగాలపై చూపిన లాక్ డౌన్ ప్రభావాన్ని సీఎం జగన్ ప్రస్తావించారు. రవాణా స్తంభించడంతో ఇండస్ట్రియల్ సెక్టార్ కుదేలైపోయిందని వివరించారు. వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. లాక్ డౌన్ వల్ల డిమాండ్, సప్లైకి తీవ్ర ఆటంకం కలిగిందని జగన్ పేర్కొన్నారు. ఈ నెల 11న జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో దీనికి సంబంధించి కొన్ని విషయాలను ప్రస్తావించానని లేఖలో గుర్తు చేశారు.

నేషనల్ హైవేస్, రైళ్లు..

నేషనల్ హైవేస్, రైళ్లు..

దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ కోరారు. జాతీయ రహదారులు, రైళ్లు పునరుద్ధరించాలని కోరారు. దీంతో ఇండస్ట్రియల్ సెక్టార్‌ ఊతమిచ్చినవారిమి అవుతామని పేర్కొన్నారు. రవాణా స్తంభించిపోవడంతో అన్నిరంగాలు నష్టాలను చవిచూస్తున్నాయని పేర్కొన్నారు. మార్కెట్లు 50 శాతం తెరచి ఉన్నాయని జగన్ గుర్తుచేశారు. వాటిలో 20 నంచి 30 శాతం వరకు మాత్రమే కార్యకలాపాలు కొనసాగుతున్నాయని వివరించారు. రవాణా నిలిచిపోవడంతో వ్యవసాయ, ఉద్యానవన, ఆక్వా రవాణాపై తీవ్ర ప్రభావం చూపించిందని వివరించారు.

34 శాతం

34 శాతం

వ్యవసాయాధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జీఎస్‌డీపీలో 34 శాతం వ్యవసాయరంగానిదేనని జగన్ పేర్కొన్నారు. 60 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయ దాని అనుబంధ కార్యకలాపాల మీదే ఆధారపడి ఉన్నారని తెలిపారు. 80 లక్షల ఎకరాల్లో పంటలు పండుతుండగా... అందులో 17 లక్షల ఎకరాల్లో ఉద్యానవన పంటలను సాగుచేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా సప్లై చైన్‌కు పెద్ద ఎత్తున అంతరాయం ఏర్పడింది.

Recommended Video

PM Modi Address Nation By Tomorrow 10 AM, Following Jagan on Lock Down Extension
 యూనిట్స్ క్లోజ్..

యూనిట్స్ క్లోజ్..


ఎంఎస్‌ఎంఈపై కూడా లాక్‌డౌన్‌ ప్రభావం చూపించింది. ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌ ద్వారా ఏపీలో 1 కోటి 10 లక్షల మంది ఉపాధి పొందుతుండగా.. రాష్ట్ర జీఎస్‌డీపీలో 7-8 శాతం వాటా ఎంఎస్‌ఎంఈల దే. లాక్ డౌన్ కారణంగా ఆ యూనిట్లు క్లోజయ్యాయి. కేవలం 6 శాతం ఎంఎస్‌ఎంఈ యూనిట్లు 25-30 శాతం సామర్ధ్యంలో పనిచేస్తున్నాయని జగన్ వివరించారు. రాష్ట్రంలో 1,03, 986 ఫ్యాక్టరీలుండగా.. 7,250 మాత్రమే పనిచేస్తున్నాయని జగన్ పేర్కొన్నారు.

English summary
andhra pradesh chief minister ys jagan mohan reddy writes letter to prime minister narendra modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X