Viral Video : ట్రాక్టర్ నడిపిన సీఎం వైఎస్ జగన్..
ఏపీ సీఎం వైఎస్ జగన్ చురుకుదనం గురించి అందరికీ తెలిసిందే. గతంలో పలుమార్లు పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా ఇతరులతో కలిసి సరదాగా కలివిడిగా మాట్లాడుండటం జగన్ కు అలవాటే. ఇవాళ అదే కోవలో గుంటూరులో వైఎస్సార్ యంత్రసేవ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్ ఏకంగా ట్రాక్టర్ నడిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారితో కలిసి ఆయన ట్రాక్టర్ నడిపారు.
సీఎం వైఎస్ జగన్ ఇవాళ గుంటూరులో వైయస్సార్ యంత్రసేవా పథకం ప్రారంభించారు. ఇందులో భాగంగా రైతులకు ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్ల మెగా పంపిణీ చేపట్టారు. రాష్ట్ర స్ధాయి రెండో మెగా పంపిణీలో భాగంగా రూ.361.29 కోట్ల విలువ గల 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లు, 13,573 ఇతర వ్యవసాయ పనిముట్లను గుంటూరు నగరంలోని చుట్టుగుంట సర్కిల్‌లో పంపిణీ కార్యక్రమాన్ని జగన్ లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు.

అనంతరం రైతులతో కాసేపు జగన్ ముచ్చటించారు. ఆ తర్వాత అక్కడే పంపిణీ కోసం ఉంచిన ఓ ట్రాక్టర్ ఎక్కారు. ఆ కార్యక్రమానికి వచ్చిన అధికారులు, ఇతరులతో కలిసి ట్రాక్టర్ పైకి ఎక్కిన జగన్.. దాన్ని అలాగే ముందుకు నడిపారు. దీంతో అక్కడున్న వారంతా జగన్ ను ఆశ్చర్యంగా తిలకించారు. జగన్ బహిరంగంగా ట్రాక్టర్ నడపడంతో అక్కడికి వచ్చిన వైసీపీ కార్యకర్తలు, అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. జగన్ నినాదాలు చేశారు. అలాగే సోషల్ మీడియాలోనూ జగన్ ట్రాక్టర్ నడిపిన వీడియో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.












Click it and Unblock the Notifications