• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఒకే వేదికపై వైఎస్ జగన్..ఎంకే స్టాలిన్..ఎంఎస్ ధోనీ: బొమ్మ దద్దరిల్లిపోవాల్సిందే

|
Google Oneindia TeluguNews

అమరావతి: చెన్నై సూపర్ కింగ్స్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లల్లో రెండో అత్యత్తమ జట్టుగా గుర్తింపు పొందింది. టీమిండియా మాజీ కేప్టెన్, మెంటార్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా పేరు సాధించింది. ఐపీఎల్ కేరీర్‌లో ఇప్పటిదాకా నాలుగు సార్లు ఛాంపియన్‌గా ఆవిర్భవించిందీ జట్టు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ముగిసిన ఐపీఎల్ 2021, సీజన్ 14 టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్‌ మ్యాచ్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది.

 విజయోత్సవాల కోసం..

విజయోత్సవాల కోసం..


ఈ దఫా ఛాంపియన్‌గా ఆవిర్భవించినందున చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఫ్రాంఛైజీ- విజయోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది. నిజానికి- నవంబర్‌లో ఘనంగా నిర్వహించాలని భావించింది ఫ్రాంఛైజీ. మూడో వారంలో షెడ్యూల్ చేసింది. కేప్టెన్ ధోనీ అందుబాటులో లేకపోవడం వల్ల డిసెంబర్‌లో జరపడానికి సమాయాత్తమౌతోంది. విరాట్ కోహ్లీ కేప్టెన్సీలో టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ఆడుతోన్న భారత క్రికెట్ జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు ధోనీ. ప్రస్తుతం జట్టుతో పాటే అతను ఎమిరేట్స్‌లో ఉంటున్నాడు.

ధోనీ లేకుండా..

ధోనీ లేకుండా..

ఈ నెల 17వ తేదీన టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ ముగుస్తుంది. ఆ తరువాత జట్టుతో పాటు ధోనీ కూడా స్వదేశానికి వచ్చేస్తాడు. కుటుంబంతో గడపడానికి ప్రాధాన్యత ఇచ్చినందున.. ఆ నెల చివరి వరకూ అతను అందుబాటు ఉండడు. అందుకే- ఈ విజయోత్సవాలను డిసెంబర్‌కు వాయిదా వేసింది చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ. ధోనీ లేకుండా తాము ఈ విజయోత్సవాలను నిర్వహించే ప్రసక్తే లేదని ఇప్పటికే సీఎస్‌కే ముఖ్య కార్యనిర్వహణాధికారి కాశీ విశ్వనాథన్ తేల్చి చెప్పారు.

చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో..

చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో..

డిసెంబర్‌లో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఈ విజయోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి కసరత్తు చేస్తోంది ఫ్రాంఛైజీ. ఈ వేడుకలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ప్రత్యేక ఆహ్వానితుడిగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ- ముఖ్యమంత్రి కార్యాలయానికి ముందస్తు సమాచారాన్ని పంపించినట్లు తెలుస్తోంది.

 వైఎస్ జగన్‌కు సన్నిహితుడిగా..

వైఎస్ జగన్‌కు సన్నిహితుడిగా..

నిజానికి- వైఎస్ జగన్‌- చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ ఎన్ శ్రీనివాసన్‌ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ సాన్నిహిత్యంతోనే ప్రతిష్ఠాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలోనూ ఆయనకు వైఎస్ జగన్ సభ్యత్వాన్ని కల్పించారు. శ్రీనివాసన్‌కు చెందిన ఇండియా సిమెంట్స్‌, వైఎస్ జగన్ కుటుంబానికి చెందిన భారతి సిమెంట్స్ మధ్య వ్యాపార లావాదేవీలు కొనసాగుతున్నాయి. ఇటీవలే వైఎస్ జగన్.. రెండు రోజుల తిరుమల పర్యటనలనూ టీటీడీ బోర్డు సభ్యుడి హోదాలో ఎన్ శ్రీనివాసన్ ఆయన వెంటే ఉన్నారు.

 వైఎస్ జగన్‌కు ఆహ్వానం అందుకే..

వైఎస్ జగన్‌కు ఆహ్వానం అందుకే..

వైఎస్ జగన్‌తో ఉన్న సాన్నిహిత్యంతోనే ఎన్ శ్రీనివాసన్.. చెన్నై సూపర్ కింగ్స్ విజయోత్సవాలకు ఆయనను ఆహ్వానించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విజయోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందించడానికి త్వరలోనే ఆయన గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలుస్తారని చెబుతున్నారు. తేదీని నిర్ధారించిన తరువాత.. ఆయన ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉంది.

ఒకే వేదికపై ముగ్గురు..

ఒకే వేదికపై ముగ్గురు..

తమిళనాడులో వైఎస్ జగన్‌కు మాస్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన పేరు మీద చాలాసార్లు, అనేక సందర్భాల్లో బ్యానర్లు వెలిశాయి. పుట్టినరోజు మొదలుకుని.. పలు సందర్భాల్లో ఈ బ్యానర్లు కనిపించాయి. స్టార్ హీరో విజయ్‌ ఫ్యాన్స్ చాలామంది వైఎస్ జగన్‌ను అభిమానిస్తారు. వారంతా పొలిటికల్ స్టార్‌గా అభివర్ణిస్తారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు ఉన్న ఫాలోయింగ్ కూడా అంతే. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి స్టాలిన్ హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి వేదికను పంచుకున్నారు. ఇక మహేంద్రుడి గురించి చెప్పుకోనక్కర్లేదు. దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్‌తో సమానంగా ధోనీకి అభిమాన సంఘాలు ఉన్నాయి. ఈ ముగ్గురూ ఒకే వేదిక మీద కనిపించడం అరుదుగా చెప్పుకోవచ్చు.

షేర్ మార్కెట్‌లోనూ

షేర్ మార్కెట్‌లోనూ

షేర్ మార్కెట్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ దుమ్ము లేపుతోంది. మార్కెట్‌ వేల్యుయేషన్‌ పరంగా యూనికార్న్ కంపెనీగా రూపుదిద్దుకుంటోంది. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఉన్న మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది ఇండియా సిమెంట్స్‌‌ను కూడా అధిగమించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఓ స్పోర్ట్స్ బ్రాండ్, ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఈ స్థాయిలో స్టాక్ మార్కెట్‌లో తన వేల్యూను పెంచుకోవడం అనేది ఇదే తొలిసారి. అందుకే ఈ విజయోత్సవాలను మరింత గ్రాండ్‌గా నిర్వహించాలని శ్రీనివాసన్ ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

English summary
Chief Minister YS Jagan Mohan Reddy is likely to attend Chennai Super Kings' celebrations in Chennai. This celebrations likely to placed in December.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X