పవన్ కల్యాణ్ కు గూస్ బంప్స్ వచ్చే షాక్ ఇచ్చిన జగన్?

రోడ్ షోలు, బహిరంగసభలను నిషేధిస్తూ పోలీసుల అనుమతి ఉన్నచోటనే వాటిని జరుపుకునే వీలు కల్పిస్తూ ఏపీ 30 పోలీస్ యాక్ట్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. జీవో నెం.1 ద్వారా చంద్రబాబునాయుడు కుప్పం పర్యటన అత్యంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య సాగింది. చట్టం అమల్లో ఉండటంతో చంద్రబాబు నియోజకవర్గంలోని గ్రామాల్లో పాదయాత్ర చేశారు. కొంతమంది టీడీపీ నాయకులు దాన్ని ధిక్కరించడంతో వారిపై నాన్ బెయిలబుల్ కేసులు బనాయించారు.

శ్రీకాకుళంలో అమల్లోకి వచ్చిన పోలీస్ 30 యాక్ట్

శ్రీకాకుళంలో అమల్లోకి వచ్చిన పోలీస్ 30 యాక్ట్


చంద్రబాబు తర్వాత వంతు పవన్ కల్యాణ్ దేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఏపీ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని జిల్లా ఎస్పీ జీఆర్ రాధిక ప్రకటించారు. తమ అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదని, ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే శిక్షార్హులవుతారని స్పష్టం చేశారు. జనవరి 12వ తేదీన స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని రణస్థలంలో జనసేన ఆధ్వర్యంలో యువశక్తి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎంతో మంది తన అభిమానులు ఓటర్లుగా ఇతర పార్టీలకు ఓటు వేస్తున్నారని, తన సభలకు, సమావేశాలకు వచ్చే అభిమానులను రాష్ట్రవ్యాప్తంగా జనసేన కార్యకర్తలుగా మార్చాలని పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా యువశక్తిని ఏర్పాటు చేశారు.

పవన్ శ్రీకాకుళంలో అడుగు పెడితే...

పవన్ శ్రీకాకుళంలో అడుగు పెడితే...

కుప్పంలో చంద్రబాబునాయుడి పర్యటలనే అత్యంత ఉద్రిక్తతల మధ్య సాగుతోంది. అటువంటిది పవన్ కల్యాణ్ శ్రీకాకుళం జిల్లాలోకి అడుగుపెడితే ఇంకెన్ని పరిణామాలు చోటుచేసుకుంటాయోనని భావిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలని జనసేన ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఒకసారి పవన్ కల్యాణ్ రణస్థలిని పరిశీలించి వచ్చారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఏకంగా వారంరోజులపాటు అక్కడే మకాం వేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషిచేస్తున్నారు.

వేదికపై నుంచి యువతనే మాట్లాడించబోతున్న జనసేన

వేదికపై నుంచి యువతనే మాట్లాడించబోతున్న జనసేన

ప్రతిసారి సభల్లో నేతలు మాట్లాడుతుంటే ప్రజలు వింటున్నారని, కానీ యవశక్తిలో కేవలం యువతను వర్తమాన రాజకీయాలు, చదువులు, ఉపాధి, ప్రజా సమస్యలు, నిరుద్యోగం తదితర అంశాలపై మాట్లాడించబోతున్నారు. సభ వేదికగా అందరితో తమ అభిప్రాయాలు పంచుకోవడానికి యువశక్తి ఒక వేదికగా మారబోతోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి పవన్ అభిమానులు భారీసంఖ్యలోహాజరుకాబోతున్నారు. అయితే ఈ జీవో గురించి పట్టించుకోకుండా రణస్థలంలో జనసేన నాయకులు, కార్యకర్తలు సభా వేదికను చకచకా ఏర్పాటు చేస్తున్నారు. 12వ తేదీ వచ్చేసరికి రాష్ట్రంలో ఎటువంటి ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంటుందోననే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+