Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఢిల్లీకి వైఎస్ జగన్- ఆ కీలక భేటీ: డిమాండ్లపై

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. దేశ రాజధాని వేదికగా ఈ నెలాఖరున ఏర్పాటయ్యే కీలక సమావేశానికి హాజరు కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన డిమాండ్లపై మరోసారి గళమెత్తనున్నారు. రాష్ట్రం ఎదుర్కొంటోన్న విభజన సమస్యలను కేంద్ర ప్రభుత్వానికి వినిపించనున్నారు. ప్రత్యేక హోదా, పోలవరంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి వివరించనున్నారు.

ఈ నెల 27వ తేదీన నీతి ఆయోగ్.. ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో సమావేశం కానుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు లేదా ఆర్థికశాఖ మంత్రులు ఈ భేటీలో పాల్గొనున్నారు. ఈ భేటీ కోసం ఈ నెల 26వ తేదీ సాయంత్రం వైఎస్ జగన్.. ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. అదే రోజు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలుసుకునే అవకాశం ఉంది.

AP CM YS Jagan to participate in the Niti Aayog meeting scheduled

మరుసటి రోజు విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటయ్యే నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొంటారు. ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను అమలు చేయడం, విభజన సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. పోలవరం ప్రాజెక్ట్, నిధులు-విధుల విభజన, ప్రత్యేక హోదా గురించి మాట్లాడనున్నారు. పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9లో పొందుపరిచిన 91 ఇన్‌స్టిట్యూషన్స్, షెడ్యూల్ 10 కింద చేర్చిన 142 ఇతర సంస్థల విభజన అంశాన్ని ప్రస్తావించనున్నారు.

అదే రోజున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మోదీ అపాయింట్‌మెంట్ కోసం ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. నీతి ఆయోగ్ ముగిసిన తరువాత వైఎస్ జగన్.. ప్రధానితో భేటీ అయ్యేలా షెడ్యూల్‌ను రూపొందిస్తోన్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ భేటీలో పాల్గొననున్నారు. 27వ తేదీన ఢిల్లీ వెళ్లనున్నట్లు ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తెలిపారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన ఈ ఎనిమిదిన్నర సంవత్సరాల కాలంలో పునర్విభజన చట్టంలో పొందుపరిచిన మెజారిటీ అంశాలు పరిష్కారానికి నోచుకోవట్లేదు. ఎక్కడి ఆస్తులు అక్కడే ఉన్నాయి. వాటి విలువ సుమారు లక్షన్నర కోట్ల రూపాయలు. ఈ విభజన సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా పెద్దగా ఆసక్తి చూపట్లేదు.

ఈ చర్యలను వేగవంతం చేసేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో పలు పిటీషన్లు సైతం దాఖలయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ లోక్‌సభ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్, తెలంగాణ వికాస కేంద్ర సహా మరి కొందరు ఈ పిటీషన్లను దాఖలు చేశారు. దీనిపై ఏపీ ప్రభుత్వం కూడా స్పందించింది. అఫిడవిట్‌ను దాఖలు చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+