రేపు గుంటూరు, కర్నూలు జిల్లాల్లో జగన్ టూర్-రైతు భరోసా నిధుల విడుదల..
ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు రెండు జిల్లాల్లో పర్యటించబోతున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఓ ప్రైవేటు కార్యక్రమంతో పాటు కర్నూలు జిల్లాల్లో ఓ అధికారిక కార్యక్రమంలో జగన్ పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ఇవాళ విడుదల చేసింది. దీని ప్రకారం ఉదయం గుంటూరు జిల్లాలో పర్యటించే జగన్ మధ్యాహ్నానికి కర్నూలు జిల్లా వెళ్లనున్నారు.
రేపు గుంటూరు జిల్లా మంగళగిరి, కర్నూలు జిల్లాలో సీఎం వైయస్.జగన్ పర్యటించనున్నట్లు సీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది.ఉదయం మంగళగిరి సీ కే కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి సోదరుడు పేర్నాటి రామలింగారెడ్డి కుమారుడు కౌశిక్ వివాహానికి సీఎం జగన్ హాజరుకానున్నారు. కౌశిక్ పెళ్లికి హాజరై సీఎం జగన్ వధూవరులను ఆశీర్వదిస్తారు.అనంతరం అక్కడ నుంచి గన్నవరం చేరుకుని.. కర్నూలు జిల్లాకు బయులుదేరుతారు.

ఆ తర్వాత కర్నూలు జిల్లా పత్తికొండలో వరుసగా ఐదో ఏడాది మొదటి విడతగా వైయస్సార్ రైతుభరోసా- పీఎం కిసాన్ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ నగదు జమ చేయనున్నారు. పత్తికొండలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లిషు మీడియం స్కూల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభా వేదికకు జగన్ చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించిన అనంతరం, వరుసగా ఐదో ఏడాది - తొలివిడత వైయస్సార్ రైతుభరోసా- పీఎం కిసాన్ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. సభ అనంతరం మధ్యాహ్నం సీఎం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.












Click it and Unblock the Notifications