అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒకే వేదిక మీదికి జగన్, పవన్ కళ్యాణ్: ఎక్కడ, ఎందుకు?

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, వైఎస్ఆర్ సీపీ చీఫ్ వైఎస్ జగన్ ఒకే వేదికను పంచుకోనున్నారు.'ప్రత్యేక హోదా భరోసా సభ' పేరుతో కాంగ్రెస్ పార్టీ ఈ నెల 4న, గుంటూరులో సభను నిర్వహిస్తోంది.

|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, వైఎస్ఆర్ సీపీ చీఫ్ వైఎస్ జగన్ ఒకే వేదికను పంచుకోనున్నారు.'ప్రత్యేక హోదా భరోసా సభ' పేరుతో కాంగ్రెస్ పార్టీ ఈ నెల 4న, గుంటూరులో సభను నిర్వహిస్తోంది.ఈ సభలో ఈ నేతలు ఒకే వేదికపై కన్పించనున్నారు.

ప్రత్యేకహోదా అంశాన్ని మరోసారి తెరమీదికి తీసుకురానుంది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల ముందు టిడిపి, బిజెపిలు ప్రత్యేక హోదావిషయమై చేసిన హమీలను తుంగలో తొక్కాయని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పిస్తేనే ప్రయోజనం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిప్రాయంతో ఉన్నారు. ఈ విషయమై జాతీయ పార్టీ నాయకులను కలిసి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను కల్పించేందుకు సహకరించాలని కోరారు.

ప్రత్యేక హోదా విషయమై కాంగ్రెస్ పార్టీ అధికార టిడిపిని ఇరుకునపెట్టేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది.ఈ మేరకు తమతో కలిసివచ్చేపార్టీలతో కలిసి కార్యక్రమాలను నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది.

ఒకే వేదికపై పవన్ , జగన్

ఒకే వేదికపై పవన్ , జగన్

ప్రత్యేక హోదా భరోసా సభ పేరుతో ఈ నెల 4వ, తేదిన గుంటూరులో నిర్వహించే సభకు వైసీపీ చీఫ్ జగన్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ లు ఒకే వేదికను పంచుకోనున్నారు. వీరిద్దరూ నేతలు ఒకే వేదికను ఇప్పటివరకు పంచుకోలేదు. అయితే రాష్ట్రంలో రాజకీయపరిస్థితులు మార్పులు చోటుచేసుకొన్నాయి. ప్రత్యేక హోదాను పవన్ కళ్యాణ్ సమర్థిస్తున్నాడు. వైసీపీ కూడ ప్రత్యేకహోదాను సమర్థిస్తోంది.దరిమిలా కాంగ్రెస్ పార్టీ నిర్వహించే ప్రత్యేక హోదా భరోసా సభకు కాంగ్రెస్ పార్టీ వీరిద్దరిని కూడ ఆహ్వానించింది. వీరిద్దరూ కూడ ఈ
సభకు హాజరౌతారని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు.

ఎన్నికలకు ముందు మోడీ బాబుతో పవన్

ఎన్నికలకు ముందు మోడీ బాబుతో పవన్

2014 ఎన్నికలకుముందు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థిమోడీతో కలిసి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ముగ్గురు కలిసి ఒకే వేదికపై నుండి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. టిడిపి బిజెపి కూటమికి ఓటేయాలని పవన్ కళ్యాణ్ ప్రజలను కోరారు.అయితే మూడేళ్ళకాలంలో తెలుగుదేశం ప్రభుత్వం అనుసరించిన విధానాలపై పవన్ కళ్యాణ్ బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.ప్రత్యేక హోదా గురించి పవన్ ప్రత్యేకించి సభలు నిర్వహించారు.

ప్రత్యేక హోదాతోనే లాభం

ప్రత్యేక హోదాతోనే లాభం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లభిస్తేనే ప్రయోజనంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతోంది.ఈ విషయమై రాష్ట్రానికి ఏ రకంగా లాభాలు కలిగే అవకాశాలున్నాయనే విషయమై ప్రజలకు వివరించనుంది. ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం వల్ల ఏ మేరకు రాష్ట్రానికి ప్రయోజనం కలిగిందనే పోలికను కూడ కాంగ్రెస్ వివరించనుంది.

కాంగ్రెస్ పునరుజ్జీవానికి ప్రత్యేక హోదా సభ

కాంగ్రెస్ పునరుజ్జీవానికి ప్రత్యేక హోదా సభ

2014 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కసీటు కూడ దక్కలేదు. చాలా స్థానాల్లో ఆ పార్టీ తరపున పోటీచేసిన అభ్యర్థులంతా డిపాజిట్లు గల్లంతయ్యాయి. అయితే మూడేళ్ళవరకు కూడ ఏపీలో కాంగ్రెస్ పార్టీ కోలుకోలేదు.అయితే రానున్నరోజుల్లో పార్టీని కాపాడుకొనేందుకుగాను ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాన్ని ప్రారంభించింది. ఈ మేరకు ప్రత్యేక హోదా భరోసా సభ ద్వారా కలిసివచ్చేపార్టీలతో పోరాటాలకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది.

English summary
Andhra pradesh congress party will conduct meeting special status sabha in Guntur on june 4. Janasena chief pawan kalyan, ysrcp chief ys Jagan and other party leaders will participate in thie meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X