Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో కనిష్ట స్ధాయికి కరోనా కేసులు- 24 గంటల్లో 1901 మాత్రమే...

ఏపీలో కరోనా ప్రభావం అంతకంతకూ తగ్గుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో కరోనా ప్రభావం తగ్గుతున్నట్లు రోజువారీ నివేదికలు స్పష్టం చేస్తుండగా.. ఇప్పుడు తాజాగా ఆ సంఖ్య మరింత తగ్గినట్లు ఇవాళ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్ వెల్లడించింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కేవలం 1901 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి.

ఏపీలో గత 24 గంటల్లో నమోదైన కేసుల్ని పరిశీలిస్తే.. అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లాలో 397 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత స్ధానాల్లో తూర్పుగోదావరి 313, గుంటూరు 295, చిత్తూరు 289, ప్రకాశం 104 ఉన్నాయి. అత్యల్ప కేసుల జాబితాలో శ్రీకాకుళం జిల్లా కేవలం 18 కేసులతో ముందుంది. ఆ తర్వాత అనంతపురంలో 21, విజయనగరం 59, కర్నూలు 63, కృష్ణా 74, కడప 85, విశాఖ 85 కేసులు నమోదయ్యాయి.వీటితో కలుపుకుని ఇప్పటివరకూ ఏపీలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8 లక్షల 8 వేలకు చేరింది.

ap covid 19 daily cases touches another low, only 1901 new cases in last 24 hours

Recommended Video

    Andhra Pradesh : 2997 New Covid 19 Cases Reported In AP | Oneindia Telugu

    గత 24 గంటల్లో మృతుల సంఖ్య కూడా భారీగా తగ్గింది. రాష్ట్రంలోని కేవలం 10 జిల్లాల్లో 19 మరణాలు మాత్రమే నమోదయ్యాయి. ఇందులో చిత్తూరులో నలుగురు, కడపలో ముగ్గురు, అనంతపూర్‌, తూర్పుగోదావరిలో ఇద్దరేసి, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమ గోదావరిలో ఒక్కరు చొప్పున చనిపోయారు. వీరితో కలుపుకుని ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 6606కు చేరింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+