పాదయాత్ర చేసినా జగన్‌కు జైలు తప్పదు: కెఈ కృష్ణమూర్తి
కర్నూల్: ఎన్ని పాదయాత్రలు చేసినా వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చెప్పారు.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కడ జారిపోతారోనన్న భయం జగన్‌కు పట్టుకుందని చెప్పారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారని కెఈ కృష్ణమూర్తి తప్పుబట్టారు.ఈ ప్రచారంలో వాస్తవం లేదని కెఈ చెప్పారు.

ఈ రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.ప్రతి వారం కోర్టుకు హజరు కావాల్సిన వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ఎలా నిర్వహిస్తారని కెఈ ప్రశ్నించారు.
వైసీపీకి చెందిన కొందరు కీలక నేతలు, ప్రజాప్రతినిధులు టిడిపిలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. దరిమిలా కర్నూల్ జిల్లాకు చెందిన నేతలతో వైసీపీ చీఫ్ జగన్ సమావేశమయ్యారు. వైసీపీలోనే కొనసాగుతామని ఆ పార్టీ నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications