ఆ రాళ్లతోనే రాజధాని: కేఈ, 'జగన్‌ది స్మశాన దీక్ష'
అమరావతి: మంగళగిరిలో నిర్వహించిన సమరదీక్ష ముగింపు సభలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మాట్లాడుతూ బూటకపు వాగ్దానాలతో ప్రజలను వంచించినందుకు ప్రజలు ఆగ్రహావేశాలతో ఉన్నారని, భద్రత లేకపోతే ఆయన్ను రాళ్లతో కొడతారని చంద్రబాబునుద్దేశించి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఈ వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పందించారు. తెలుగు దేశం ప్రభుత్వంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ విసురుతున్న రాళ్లను ఏరి, వాటితోనే రాజధానిని కడతామని అన్నారు. వైయస్ జగన్ రోజూ తన సొంత పేపర్ చదువుకొని ఏపీలో అభివృద్ధి ఏమీ జరగడం లేదని అనకుంటున్నారని, అప్పుడప్పుడూ మిగిలిన పేపర్లు కూడా చదివితే బాగుంటుందన్నారు. జగన్ దీక్షలన్నీ కుహనా దీక్షలేనని కేఈ వ్యాఖ్యానించారు.
'రాష్ట్ర విభజనతో ఆందోళనకు గురైన ఏపీ ప్రజలకు చంద్రబాబు తన పాలతో భవిష్యత్తుపై భరోసా కల్పించారు. నవ్యాంధ్ర కష్టాల పాలు కావలనీ, రాజధాని నిర్మాణం ఆగిపోవాలనీ కేసీఆర్, జగన్ కోరుకుంటున్నారు. ఏపీ ప్లాఫ్ అయితే తాను బాగా చేశానని చెప్పుకోవచ్చనేది కేసీఆర్ కోరిక. అన్ని సవ్యంగా జరిగితే ప్రజలు జగన్‌ని మరిచిపోతారని ఆందోళన' అని తెలిపారు.

మేము సగర్వంగా కాలరెత్తుకొని చెబుతున్నాం. రాజధాని నిర్మాణం కోసం దేశం మొత్తం మీద 33 వేల ఎకరాల భూమి సేకరించిన ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు. ఢిల్లీ వెళ్లి దొంగచాటుగా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి తన కేసుల గురించి బతిమాలుకోని రావండ, ఇక్కడ రెండు నెలలకు ఒకసారి దీక్ష చేయడం తప్ప జగన్‌కు ఏమీ తెలియదన్నారు.
'హైదరాబాద్‌లో తన ఆస్తులను కాపాడుకోడానికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతిచ్చాడు' అని అన్నారు. ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్న జగన్ అది రద్దయితే మళ్లీ జైలు కెళ్లాల్సి ఉంటుందని కేఈ మండిపడ్డారు.
జగన్ చేసిం శ్మశాన దీక్ష: టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు
మంగళగిరిలోని వై జంక్షన్ వద్ద వైయస్ జగన్ చేసింది సమర దీక్ష కాదని శ్మశాన దీక్ష అని టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రౌడీలు, దొంగలు, దోపిడీదారులే ప్రజలను నిద్రపోనివ్వరని, ఆ కోణంలోనే చంద్రబాబును జగన్ నిద్రపోనివ్వనంటున్నారని మండిపడ్డారు.
జైలుకెళ్లి, కోర్టుల చుట్టూ తిరిగే జగన్ లాంటి నేత ప్రతిపక్ష నేతగా ఉండటం ఏపీ ప్రజల దురదృష్టకరమని అన్నారు. వైయస్ జగన్, కేసీఆర్ గత ఎన్నికల్లో కుదుర్చుకున్న రహస్య ఒప్పందం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బయటపడిందని తెలిపారు.












Click it and Unblock the Notifications