టాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్‌తో అమరావతి డిజైన్లు గీయిస్తారా?: వెంట పిలుచుకొచ్చిన పవన్, త్రివిక్రమ్
Pawan Kalyan: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. రాజధాని అమరావతిపై పూర్తిగా కాన్సన్‌ట్రేషన్ చేసింది. ఈ అయిదు సంవత్సరాల్లో ఈ నగరాన్ని ఓ రూపానికి తీసుకుని రావాలనే పట్టుదలతో ఉంది.
రాజధానిగా అమరావతిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికే అధిక ప్రాధాన్యత ఇస్తానంటూ ఇటీవలే చంద్రబాబు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. అమరావతిపై శ్వేతపత్రం విడుదల సమయంలోనే దీనిపై స్పష్టతను ఇచ్చారు. జగన్ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతిలో భారీ విధ్వంసం చోటు చేసుకుందని, దాన్ని సరి చేస్తామనీ అన్నారు.

ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసింది కూడా. అమరావతి ప్రాంతంలో పెరిగిన పిచ్చి చెట్లను తొలగించడానికి టెండర్లను ఆహ్వానించింది. దీనికోసం 36.50 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టనున్నట్లు తెలిపింది. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో 25,000 ఎకరాలలో జంగిల్ క్లియరింగ్, భూమిని చదును చేయాలనేది ఈ టెండర్ల ప్రక్రియ ఉద్దేశం.
అర్హతలు, తక్కువ మొత్తాన్ని కోట్ చేసిన సంస్థలకు జంగిల్ క్లియరెన్స్ పనులను అప్పగిస్తుంది ప్రభుత్వం. కొన్ని నిబంధనలు, మార్గదర్శకాలనూ సూచించింది. నెల రోజుల గడువు ఇచ్చింది. ఈలోగా నిర్దేశించిన పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది కాంట్రాక్ట్‌ను దక్కించుకున్న సంస్థకు.
ఈ పరిస్థితుల మధ్య టాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి ఏపీకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రతి వారాంతపు రోజుల్లో పవన్ కల్యాణ్ తెలంగాణలోని హైదరాబాద్‌కు వెళ్లిపోతారనే విషయం తెలిసిందే. మళ్లీ సోమవారం నాడు సొంత రాష్ట్రానికి తిరిగి వస్తారు.
హైదరాబాద్ నుంచి విజయవాడకు పవన్ కల్యాణ్ వచ్చారు. పవన్ తో పాటు వచ్చిన త్రివిక్రమ్, ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి కూడా వచ్చారు.
— JJ Creative Works (@jj_creativework) July 15, 2024
#PawanKalyan #Janasena pic.twitter.com/3l4A8o1aSu
కొద్దిసేపటి కిందటే ఆయన విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో అడుగు పెట్టారు. ఎయిర్‌పోర్టులో పవన్ వెంట ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కనిపించారు. పవన్ రావడం సహజమే అయినప్పటికీ.. ఆయన వెంట ఒకే ఫ్లైట్‌లో త్రివిక్రమ్, ఆనంద్ సాయి రావడం వార్తై కూర్చుంది.
అమరావతి డిజైన్లపై ఆనంద్ సాయి, త్రివిక్రమ్‌తో చర్చిస్తారనే అభిప్రాయాలు అప్పుడే వ్యక్తమౌతోన్నాయి కూడా. 2014- 2019 మధ్యకాలంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అమరావతి డిజైన్ల కోసం బాహుబలి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌలితో సంప్రదింపులు జరిపిన విషయాన్ని దీనితో ముడిపెట్టి చూస్తోన్నారు నెటిజన్లు.












Click it and Unblock the Notifications