రేవంత్‌రెడ్డి ప్రభుత్వ నిర్ణయంపై పవన్ కల్యాణ్ స్పందన

తెలంగాణ అసెంబ్లీలో హీరో అల్లు అర్జున్ పై నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కు తరలిరావాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. పవన్ ఈ పిలుపునివ్వడం ఆసక్తిని సంతరించుకుంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా పవన్ అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం గిరిజన ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించి ప్రకృతికి తన్మయత్వం చెందారు. గిరిజన ప్రాంతాల్లో ఇటువంటి అందమైన, సుందరమైన ప్రదేశాలు ఏపీలో చాలా ఉన్నాయని, సినీ పరిశ్రమకు బాగా ఉపయోగపడతాయన్నారు.

ఏపీ ప్రభుత్వం సహకారం అందిస్తుంది
ఈ ప్రాంతాల్లో షూటింగ్ చేస్తే తెలుగు సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం ఎంతో సహకారాన్ని అందిస్తుందన్నారు. అంతేకాకుండా స్థానికులు ఉపాధి లభిస్తుందని, పరిశ్రమకు తగిన చేయూతనిస్తామని పవన్ హామీ ఇచ్చారు. ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు సినీ పరిశ్రమపై, అల్లు అర్జున్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం సినిమాలకు బెనిఫిట్ షోలకు, టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతిచ్చేది లేదని తేల్చిచెప్పారు. అల్లు అర్జున్ కు కాలు బాగోలేదా? చెయ్యి బాగోలేదా? కన్ను బాగోలేదా? కిడ్నీ బాగోలేదా? పరిశ్రమ మొత్తం పోలోమంటూ తరలివెళ్లిందంటూ మండిపడ్డారు.

ap deputy cm Pawan Kalyan s response to telangana government s decision

కోమటిరెడ్డి కూడా చెప్పారు
థియేటర్ లో జరిగిన ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందగా, ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితిపై హెల్త్ బులెటిన్ ను వైద్యులు విడుదల చేశారు. కళ్లు తెరిచి చూస్తున్నప్పటికీ ఎవరినీ గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నాడని వైద్యులు చెప్పారు. శ్రీతేజ్ కు ట్రైకస్టమీ చేశారు. ఆ బాలుడిని పరిశ్రమకు చెందినవారెవరూ కనీసం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించలేదని రేవంత్ రెడ్డి పరిశ్రమపై ధ్వజమెత్తారు. అసెంబ్లీలో ముందుగా సంధ్య థియేటర్ లో ఏం జరిగిందో ప్రభుత్వం నుంచి స్పష్టత కావాలని అక్బరుద్దీన్ ఓవైసీ కోరగా అందుకు రేవంత్ రెడ్డి పై విషయాలన్నీ లేవనెత్తారు. భవిష్యత్తులో తెలంగాణలో ఏ సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతివ్వబోమని మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+